పిల్లలకు డబ్బు విలువ తెలియట్లేదు.. ఆందోళన చెందుతున్న పేరెంట్స్

by samatah |   ( Updated:2023-08-17 06:35:38.0  )
పిల్లలకు డబ్బు విలువ తెలియట్లేదు.. ఆందోళన చెందుతున్న పేరెంట్స్
X

దిశ, ఫీచర్స్ : తమ పిల్లలకు ఆర్థిక నిర్వహణ బాధ్యత, డబ్బు విలువ సరిగ్గా తెలియవని దాదాపు మూడు వంతులకంటే ఎక్కువమంది పేరెంట్స్ ఆందోళన చెందుతున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. పిల్లల్లో ఆర్థిక అవగాహన గురించి తెలుసుకునే ఉద్దేశంతో వన్‌పోల్ సంస్థ 5 నుంచి 17 సంవత్సరాల వయస్సుగల 2000 మంది పిల్లల తల్లిదండ్రులను సర్వే చేసింది. అయితే ఆర్థిక బాధ్యత ఇంట్లోనే మొదలవుతుందని 82 శాతం మంది పేరెంట్స్ ఈ సందర్భంగా అంగీకరించారు. యావరేజ్‌గా మనీ హాబిట్స్ 15 ఏళ్ల వయస్సులో ఏర్పడతాయని అందరూ నమ్ముతున్నారు. అందువల్ల 85 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లలకు డాలర్ లేదా రూపాయి విలువను నేర్పించాలని భావిస్తున్నారు.

వరల్డ్ వైడ్ 64 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆర్థిక అంశాలను నేర్చుకునేలా పరోక్షంగా సహకరిస్తున్నారు. 62 శాతం మంది మనీ జార్ లేదా పిగ్గీ బ్యాంక్ ప్రారంభించడం ద్వారా పొదుపు పాఠాలు నేర్పుతున్నారు. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సర్దుబాటు చేయడానికి డబ్బు దాచాలని 56 శాతం మంది పేరెంట్స్ పిల్లలకు పాకెట్ మనీ లేదా అలవెన్సులు ఇస్తున్నారట. మరో 57 శాతం మంది పేరెంట్స్ వివిధ దుకాణాలలో ధరలను సరిపోల్చడం ద్వారా తెలివిగా షాపింగ్ చేయడాన్ని చిన్నారులకు నేర్పిస్తున్నారు. 51 శాతం మంది తమ కుటుంబ ఆర్థిక విషయాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలముందే ఆదాయం, రాబుడులు, ఖర్చుల గురించి చర్చిస్తున్నారు. అయినప్పటికీ యుక్త వయస్సులో ఉన్నప్పుడు పిల్లలు ఆర్థిక నిరక్షరాస్యులుగానే ఉంటారని, డబ్బు విలువను పెద్దగా పట్టించుకోరని, అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపరని పేరెంట్స్ అంగీకరిస్తున్నారు.

Advertisement

Next Story