Moduga Flower: మోదుగ పువ్వు ఉపయోగాలేంటో తెలుసా?

by Prasanna |
Moduga Flower: మోదుగ పువ్వు ఉపయోగాలేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మోదుగ పువ్వులను అగ్ని పూలు అని కూడా పిలుస్తారు. ఎర్రని అందమైన పూల గుత్తులతో మోదుగ చెట్టు చూడటానికి ఏంతో అందంగా ఉంటుంది. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. మోదుగ పువ్వులు చిలక ముక్కు లాగా కొక్కెం లా ఉండి నారింజ వర్ణంలో చాలా అందంగా ఉండి చూపరులను కనువిందు చేస్తాయి. మోదుగ పూల పుప్పొడిని వినియోగించి హోలీ రంగులలో కలిపే పదార్ధాన్ని తయారు చేస్తున్నారు.

ఈ మోదుగ పూల ఆకులను అనేక పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు. ఈ పువ్వులు పరమ శివునికి ఏంతో ప్రీతి పాత్రమైనవిగా మన పూర్వీకులు చెప్పుకునేవారు. ఈ చెట్టు యొక్క బెరడును ఎండబెట్టి దానిని హోమాలలొ ఉపయోగించే వారు. ఈ బెరడును కాల్చి ఇంట్లో ఉంచడం ద్వారా చెడు వాసన మరియు దుర్గాంధము పోగొట్టవచ్చు. చెట్టు యొక్క కలపను ప్యాకేజి బాక్సుల తయారీలలో కూడా వినియోగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed