పీరియడ్స్ టైమ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? ఇవే ప్రధాన కారణాలు..

by Anjali |   ( Updated:2023-03-26 14:35:14.0  )
పీరియడ్స్ టైమ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? ఇవే ప్రధాన కారణాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పీరియడ్స్ ఆడవాళ్లలో ఒక సహజమైన ప్రక్రియే అయినప్పటికీ కొంతమందికి ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి, అలసట, అసౌకర్యం వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది మహిళలకు కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. మరికొందరు తిమ్మిరి వల్ల నొప్పి కలుగుతుంది. అయితే పీరియడ్స్ టైంలో కొన్ని తప్పులు చేయడం వల్లే ఈ సమస్యలు ఎక్కువ అవుతాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెలసరిలో విపరీతమైన నొప్పికి కారణాలు ఏంటో తెలుసుకుందామా...

* రక్తస్రావం ఎక్కువ కావడం వల్ల బలహీనంగా ఉంటారు. అందుకే ఇలాంటి సమయంలో ఉపవాసాలకు దూరంగా ఉండడం మంచిది. విటమిన్లు, ఖనిజాలు, కాల్షియంతో పాటు మీ శరీరానికి పూర్తి పోషణను అందించడానికి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకొండి. ఈ సమయంలో భోజనం మానేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

* నెలసరి సమయంలో తిమ్మిరిని తగ్గించుకోవడానికి చాలా మంది టీ, కాఫీ మోతాదుకు ఎక్కువగా తాగుతుంటారు. దీంతో కొంచెం తగ్గినట్టుగా అనిపించినా ఇది సమస్యను ఇంకా పెంచుతుంది. వీటిని తాగడం వల్ల ఒత్తిడి, రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుతాయి. అంతేకాదు టీ , కాఫీని ఎక్కువగా తాగితే రోజంతా అలసిపోయినట్టుగా ఉంటారు. అందుకే వీటికి బదులుగా సేంద్రీయ టీ, ఆరోగ్యకరమైన రసాలను తాగండి.


* బ్లీడింగ్ తక్కువగా ఉందని చాలా మంది మహిళలు రోజంతా ఒక ప్యాడ్‌ను మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలా చేస్తే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు యోనిలో దురద, బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. ఈ సమస్యను నియంత్రించాలంటే మీ ప్యాడ్‌ను రోజుకు మూడుసార్లు మార్చుకోండి. ప్రతి ఆరు గంటలకు ఒకసారి ప్యాడ్స్‌ను మార్చడం వల్ల చెడు వాసనలు, మరకలు, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి.

* పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ పాల ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగే అసిడిటీ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. పీరియడ్స్ సమయంలో తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను మాత్రమే తీసుకోండి. పాలు ఎక్కువగా తాగితే మలబద్దకం సమస్య వస్తుంది.

* పీరియడ్స్ సమయంలో చర్మం మరింత సున్నితంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వ్యాక్సింగ్ చేస్తే నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ఆ సమయంలో చర్మాన్ని సాగదీయడం వల్ల నొప్పి కలుగుతుంది. అందుకే ఈ టైమ్‌లో వ్యాక్సింగ్, షేవింగ్‌కు దూరంగా ఉండండి.

Advertisement

Next Story