- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Love Expressions : ఎలా తెలిపేది..? మదిలో మాటని..! ఈ ప్రేమ భాషల గురించి తెలుసా?
దిశ, ఫీచర్స్ : ప్రేమంటే ఏమిటంటే.. ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనం చెప్తారు. అదో అనిర్వచనీయ ఆనందమని కొందరంటే.. వర్ణించలేని మధుర భావమని ఇంకొందరు పేర్కొంటారు. ఇక ప్రేమ వ్యక్తీకరణల విషయంలోనూ అదే జరుగుతుంది. వ్యక్తిని బట్టి, భాషను బట్టి, భావాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, అవసరాన్ని బట్టి కూడా వ్యక్తీకరణల తీరు మారవచ్చు కానీ.. ప్రేమ మాత్రం ఒక్కటే. అర్థాలు, విశ్లేషణలు మారవచ్చు కానీ.. అందులోని ఫీలింగ్ మాత్రం ఒక్కటే. అయితే ప్రేమ భాషలో ఫలానా పద్ధతి మాత్రమే కరెక్ట్ అనే స్థిరమైన వ్యక్తీకరణగా ఏదీ ఉండదు. కాపపోతే సాధారణంగా కొందరు ఉపయోగించే ప్రేమ భాషలను నిపుణులు గుర్తించి విశ్లేషించారు. అవేంటో చూద్దాం.
మాటల్లో వ్యక్త పరచడం
ప్రేమను ఎలా వ్యక్తీకరించాలనేది ఫిక్స్ అయిపోయిన జడపదార్థమో, పదమో కాదు. ఇది వ్యక్తి వ్యక్తికీ మారవచ్చు. వారి ఆసక్తి, క్రియేటివిటీ, అవకాశం, పరిస్థితులను బట్టి కూడా ఆధారపడి ఉండవచ్చు. అయితే సాధారణంగా కనిపించే ప్రేమ భాషల్లో మాటల ద్వారా వ్యక్తీకరించడం ఒకటిగా ఉంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పద్ధతిలో ప్రేమను వ్యక్త పరిచేవారు ఎదుటి వ్యక్తిని రకరకాల పొగడ్తలతో ప్రశంసిస్తుంటారు. వారిని ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నిస్తారు. అలాగే మెసేజ్‌ల రూపంలోనూ తమ మనసులోని మాటను వెల్లడిస్తారు. వాట్సాప్, వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా అందమైన మెసేజ్‌లు, ఎమోజీలు, సింబల్స్ పెడుతూ డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా ప్రేమ భాషను వ్యక్తం చేస్తుంటారు. ఎలా వ్యక్తం చేసినా ఇక్కడ పదాల రూపంలోనే అది ఉంటుంది. కాబట్టి నిపుణులు ప్రేమ భాషగా పేర్కొంటున్నారు.
టైమ్ స్పెండ్ చేయడం
ఏదో మాట వరుసకి చెప్పడం కాదు, లవ్ చేసిన వ్యక్తికోసం టైమ్ స్పెండ్ చేయడం కూడా ప్రేమ వ్యక్తీకరణ భాషగానే విశ్లేషిస్తు్న్నారు నిపుణులు. తమ ప్రియమైన వారికోసం అధిక సమయాన్ని కేటాయించేందుకు ఆరాట పడటం ఇందులో భాగంగా ఉంటుంది. ఏ మాత్రం టైమ్ దొరికినా భాగస్వామితో మీట్ అవ్వడానికి, వారితో మాట్లాడటానికి, వారిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే ఎదుటి వ్యక్తి చెప్పేది కూడా ఓపిగా వింటారు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఆరాధించడం కూడా లవ్ లాంగ్వేజ్‌గా కనిపిస్తుంది.
సేవా రూపంలోనూ..
ప్రేమ వ్యక్తీకరణ మాటల్లోనే కాదు, అది సేవా రూపంలోనూ ఉంటుంది. ప్రియమైన వ్యక్తికి హెల్త్ బాగోలేనప్పుడో, అవసరం ఏర్పడినప్పుడో వివిధ రకాల పనులు చేసిపెట్టడం ఇందులో భాగంగా ఉంటుంది. ఉదాహరణకు మంచి ఆహారం వండి పెట్టడం, కాఫీ, టీ వంటివి అందించడం, వివిధ పనుల్లో సహాయపడటం వంటి కార్యకలాపాల ద్వారా కూడా తమ ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తం చేస్తారు. కానీ నోరు విప్పి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మాత్రం చెప్పరు. ఇది కూడా ప్రేమ భాషలో భాగమే అంటున్నారు నిపుణులు.
గిఫ్టులు ఇవ్వడం కూడా..
కొందరు ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతారు. కానీ తరచుగా తమ ప్రియమైన వ్యక్తికి ఏదో ఒక బహుమతి ఇస్తూ సర్ ప్రైజ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవతలి వ్యక్తి ఏది ఆసక్తి ఉందో వారికి తెలీకుండానే గమనిస్తుంటారు. దానిని బహుమతిగా ఇవ్వాలనుకుంటారు. ఇందులో భాగంగా కొందరు అందమైన బహుమతులు కొంటే, మరి కొందరు ఖరీదైనవి కొంటుంటారు. మరి కొందరు సింపుల్ గిఫ్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఏమైనా ఇలా తరచుగా చేస్తుండటం ప్రేమను వ్యక్తీకరించే భాషేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఫిజికల్ టచ్
సందర్భాన్ని బట్టి ఫిజికల్ టచ్ కూడా ప్రేమ వ్యక్తీకరణలో భాగమే అంటున్నారు నిపుణులు. పైగా తాము ఇష్ట పడే వ్యక్తి స్పర్శ తగలడం వల్ల అవతలి వ్యక్తిలో హ్యాపీ హార్మోన్ల రిలీజ్‌కు కారణం అవుతుంది. ఎంతో ఒత్తిడిలో ఉన్న ఓ వ్యక్తికి నుదుటిపై కిస్ చేయడం, తలపై నిమరడం, చేతులు పట్టుకొని నేనున్నానని భరోసా ఇవ్వడొం, ఏడుస్తున్న వేళ హగ్ చేసుకొని ఓదార్చడం వంటి శారీరక స్పర్శలన్నీ ప్రేమ వ్యక్తీకరణలో భాగంగా ఉంటాయి. ఒక పెళ్లయిన వారిలో ఈ వ్యక్తీకరణ శారీరక సాన్నిహిత్యం, శృంగారం రూపంలోనూ ఉండవచ్చు. ముద్దులు, కౌగిలింతలు వంటివి కూడా ఇక్కడ ‘ప్రేమ భాష’ గానే పేర్కొంటున్నారు నిపుణులు. అయితే ప్రేమ వ్యక్తీకరణలు కేవలం ఇద్దరు యువతీ యువకులు లేదా రొమాంటిక్ భాగస్వాముల మధ్య మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఇతర మానవ సంబంధాల్లోనూ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు వివిధ రూపాల్లో వ్యక్తీకరిస్తుంటారు.