- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Life on Mars : మార్స్‌పై మంచుకింద జీవం ఉనికి..! పరిశోధనలో ఏం తేలిందంటే..
దిశ, ఫీచర్స్ : అంతరిక్షం గురించి మనకు ఇప్పటికే అనేక విషయాలు తెలిసినప్పటికీ ఇంకా తెలియనివి కూడా చాలానే ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ అన్వేషణలో భాగంగానే నిరంతర పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వివిధ గ్రహాల ఉనికి, స్వభావం, వాటిపై జీవలజాలం వంటి అంశాలపై ఇప్పటికే ఓ అవగాహన ఉంది. కాకపోతే భూమిపై తప్ప మిగతా గ్రహాల్లో జీవం ఉన్నట్లు ఇప్పటి వరకైతే ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాకపోతే అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవజాలం ఉండి ఉండి ఉండవచ్చునని, కాలక్రమంలో అది అంతరించిపోయి ఉండవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. ఈ విషయాన్ని కనుగొనేందుకు పరిశోధకులు కూడా ఎన్నో ఏండ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు.
రీసెంట్ స్టడీలో భాగంగా నాసాకు చెందిన కొంతరు శాస్త్రవేత్తలు మరోసారి కంప్యూటర్ మోడలింగ్ టెక్నాలజీ ద్వారా మార్స్‌పై పరిస్థితిని గమనించారు. కాగా ఇక్కడ గడ్డ కట్టిన మంచు లోపలికి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయని, కాబట్టి ఈ మంచు ఫలకాల కింద నీరు, అందులో ఆల్గే, ఫంగీ, మైక్రోస్కోపిక్, సియానో బ్యాక్టీరియా వంటివి డెవలప్ అయి ఉండవచ్చునని వారు అంచనాకు వచ్చారు. అలాగే అంగారకుడిపై గల మంచు ఫలకాల్లో రెండు రకాలవి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందులో ఒక రకం ఘనీభవించిన నీటివల్ల ఏర్పడినవి కాగా, రెండవ రకం గడ్డకట్టిన కార్బన్ డై ఆక్సైడ్‌తో నిండి ఉన్నట్లు పేర్కొంటున్నారు. అలా మంచు గడ్డకట్టిన కాలంలో అందులోని దుమ్ము, ఇతర పదార్థాలు కూడా ఘనీభవించి ఉంటాయని, అందుకే మార్స్‌పై గల మంచు సూర్య కిరణాలను ఈజీగా గ్రహిస్తోందని సైంటిస్టులు అంటున్నారు. దీనినిబట్టి అంగారకుడి ఉపరితలం నుంచి మంచు ఫలకాల కింద దాదాపు 9 అడుగుల లోతులో నీటి ప్రవాహం ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తాజా అధ్యయనం కూడా అంగారకుడిపై మంచు ఫలకాల కింద నీరు, అందులో సూక్ష్మజీవులు ఉండవచ్చునని ప్రతిపాదించగా దీనిపై అమెరికా స్పేస్ ఏజెన్సీ(నాసా) వివరణ ఇచ్చింది. ఏంటంటే.. మార్స్‌పై జీవం ఉనికికి సంబంధించిన ప్రతిపాదనలే తప్ప కచ్చితమైన ఆధారలేవీ ఇంకా లభించలేదని పేర్కొన్నది. భూమిపై ఉండే మంచులో దుమ్ము ఉంటుందని, ఈ పరిస్థితిని క్రయోకోనైట్ అంటారని సైంటిస్టులు అంటున్నారు. ఇది సూర్యుడి వేడిని పీల్చుకోవడంవల్ల ఐస్ కింద నీరు నీరు, సూక్ష్మ జీవులు ఉంటున్నాయి. అంగారకుడిపై కూడా అక్కడి మంచు ఫలకాలు సూర్యుడి వేడిని గ్రహిస్తు్న్నాయి. కాబట్టి జీవజాలం మనుగడపై సానుకూల అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. తప్ప శాస్త్రీయ ఆధారాలైతే ఇంకా లభించలేదని నాసా పేర్కొన్నది.