Laughter therapy : ఒక్క నవ్వు చాలు.. 10 శాతం హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు !

by Prasanna |   ( Updated:2023-08-28 08:26:26.0  )
Laughter therapy : ఒక్క నవ్వు చాలు.. 10 శాతం హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు !
X

దిశ, ఫీచర్స్: నవ్వు నాలుగు విధాలా చేటు అనేది కాలం చెల్లిన మాట. నవ్వు అన్ని విధాలా మంచిది అనేది ఆధునిక అధ్యయనాలు చెప్తున్న మాట. అందుకే లాఫింగ్ థెరపీలకు ప్రయారిటీ పెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. నవ్వుకు గొప్ప హీలింగ్ పవర్ ఉందని, అనేక అనారోగ్యాల బారినుంచి అది కాపాడుతుందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గుండె కణజాల విస్తరణను ప్రేరేపించడం, బాడీ మొత్తానికి ఆక్సిజన్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా హార్ట్ హెల్త్‌పై లాఫింగ్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని నిపుణులు చెప్తున్నారు.

హార్ట్ డిసీజ్ సింప్టమ్స్‌ను పరిష్కరించడంలో లాఫింగ్ థెరపీ ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులు కరోనరీ ఆర్టరీ డిసీజ్‌తో బాధపడుతున్న 64 ఏళ్ల వయస్సుగల 26 మందిని స్టడీ చేశారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి మూడు నెలలపాటు లాఫింగ్ థెరపీ అందించారు. ఇందులో ఒక గ్రూపు వారానికి రెండుసార్లు గంటసేపు కామెడీ యాక్టివిటీస్‌ను చూసేలా, మరొక గ్రూప్ పాలిటిక్స్ అండ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వంటి సబ్జెక్ట్‌తో కూడిన డాక్యుమెంటరీలను చూసేలా ఏర్పాటు చేశారు. అలా 12 వారాలు గడిచాక పాలిటిక్స్ గ్రూప్ కంటే కూడా, కామెడీ-వాచింగ్ గ్రూప్‌ వారు గుండె ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించినట్లు పరిశోధకులు గుర్తించారు. పైగా వీరిలో కార్డియో వాస్క్యులర్ వ్యవస్థ ఫంక్షనల్ యాక్టివిటీస్ 10 శాతం పెరిగాయని, గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం నుంచి బయటపడ్డారని నిర్ధారించారు.

Read More: రోబోలన్నీ అమ్మాయిల పోలికతోనే ఉంటాయి.. రీజన్ ఏంటో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed