Jealous: వర్క్‌ ప్లేస్‌ జలసీ.. మీ కెరీర్‌ను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-06-12 13:00:41.0  )
Jealous: వర్క్‌ ప్లేస్‌ జలసీ.. మీ కెరీర్‌ను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఇతరుల పట్ల పగ, ద్వేషం, కోపం మంచివి కాదంటుంటారు పెద్దలు. ఇవి మాత్రమే కాదు, జలసీ కూడా అలాంటిదేనని, ఇది జీవితాన్ని నాశనం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వర్క్‌ప్లేస్‌లో అసూయ కలిగి ఉండటం అనర్థదాయకమని , దీనివల్ల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కొలీగ్స్ లేదా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా కానీ వారి ఎదుగుదలను చూసి స్ఫూర్తి, ప్రేరణ వంటివి పొందాలే తప్ప అసూయ చెందితే స్వీయ వినాశనానికి దారితీస్తుంది.

సాధారణంగానే కొందరిలో అసూయ కనిపిస్తూ ఉంటుంది. తాము పని చేసేచోట, తమకంటే జూనియర్ అయిన కొలీగ్ లేదా ఫ్రెండ్ ప్రమోషన్ అందుకుంటే సహించలేకపోతారు. అలాగే సామర్థ్యాన్నిబట్టి ఎక్కువ సాలరీ అందుకోవడాన్ని కూడా కొందరు జీర్ణించుకోరు. అయితే కొందరు తర్వాత వాస్తవాలు గ్రహించి జలసీని కంట్రోల్ చేసుకుంటారు. తమ పనిలో నిమగ్నమై ముందుకు సాగుతారు. మరికొందరు నిరంతరం బాధపడుతుంటారు. కానీ ఈ విధమైన జలసీ వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, ఇతర అనారోగ్యాలకు కారణం దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.

అసంతృప్తికి అదే నిదర్శనం

అది ఆఫీసు కావచ్చు లేదా స్కూల్, కాలేజీ ఇంకేదైనా కావచ్చు. తోటి స్నేహితులో, మరొకరో సక్సెస్ వైపు అడుగేస్తుండటాన్ని చూసి మీరు ఇబ్బంది పడుతున్నారంటే.. అది మీలోని అసూయకు నిదర్శనం. అంతేకాదు మీ ఓన్ లైఫ్ గురించి కూడా మీరు అసంతృప్తిగా ఉన్నారని అర్థం. ఇతరుల విజయాన్ని గుణపాఠంగా భావించి లేదా స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకొని ముందుకు సాగితే మీరు కూడా సక్సెస్ అవుతారు. కానీ అసూయ చెందుతూ ఎంత ప్రయత్నించినా దాదాపు నెగెటివ్ ఫలితాలే వస్తాయి. ఎందుకంటే అసూయ మీలోని ఏకాగ్రతను, మానసిక వికాసాన్ని, ప్రతిభను బయటకు రానివ్వదు.

సెల్ఫ్ రిస్క్ పెరిగినట్లే..

అసూయ చెందడం అంటే పరోక్షంగా మీకు మీరే స్వీయ ప్రమాదాన్ని కోరి తెచ్చున్నట్లని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల సక్సెస్ సాధ్యం కాకపోగా సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గుతుంది. సెల్ఫ్ డౌట్స్ పెరుగుతాయి. ఇతరులతో పోల్చుకోవడంవల్ల నిరాశ పెరుగుతుంది. క్రమంగా అభద్రతా భావానికి, మానసిక రుగ్మతకు దారితీస్తుంది.

ఎలా పోగొట్టువాలి?

వాస్తవానికి జలసీ అనేది ఒక వ్యక్తికి తనపై తాను నమ్మకం కోల్పోవడంవల్ల పుట్టుకొస్తుంది. ఇది పోవాలంటే సెల్ఫ్- లవ్ పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఇతరులు సాధించిన విజయాల గురించి, వారి ప్రవర్తన గురించి నెగెటివ్‌గా కాకుండా, సానుకూలంగా ఆలోచించాలి. వారు ఎందువల్ల సక్సెస్ అయ్యారో అబ్జర్వ్ చేయాలి. దీనివల్ల మీకంటూ ఒక అవగాహన ఏర్పడుతుంది. క్రమంగా జలసీ ఫీలింగ్స్‌ దూరం అవుతాయి.

సామర్థ్యాలను అంచనా వేయండి

చాలామంది తమలో ఉన్న సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేయడం లేదా అంచనా వేయకపోవడం, గుర్తించకపోవడం వంటివి కూడా అసూయ భావాలకు దారితీస్తుంటాయి. అందరూ పొరపాట్లు చేస్తారు. వాటిని సరిదిద్దుకుంటూ ఎదుగుతారు. మీరు కూడా మీలోని పొరపాట్లను గ్రహించండి. లోపాలను సరిదిద్దుకోండి. మీలోని సామర్థ్యాలను అంచనా వేయడంవల్ల ‘సెల్ఫ్ - ఎవల్యూషన్’ చెందుతారు. ఈర్ష్యా ద్వేషాలు వంటివి క్రమంగా దూరం అవుతాయి.

గోల్ సెట్ చేసుకోండిలా..

లైఫ్‌లో సక్సెస్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. మీరు దీనిపై ఫోకస్ చేసే క్రమంలో అనేక గుణపాఠాలు నేర్చుకుంటారు. వాస్తవాలు గ్రహించడంవల్ల ఇతరులపై అసూయ చెందడం ఎంత తప్పో అర్థం అవుతుంది. ఎప్పుడూ ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు సాగే ప్రయత్నం చేయండి తప్ప, ఇతరుల లక్ష్యాలను అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయవద్దు.

ఎదుగుదలను ట్రాక్ చేయండి

మీరు పని విషయంలో ప్రతిరోజూ ఒకేలా ఉండటంవల్ల నష్టం జరగవచ్చు. మరింత మెరుగుదల రావాలంటే ఎప్పటికప్పుడు మీ గ్రోత్‌ను మీరే ట్రాక్ చేయండి. ఆశించిన ఫలితం రాకపోతే మాత్రం నిరాశ చెందకండి. ఎందుకలా జరిగిందో విశ్లేషించుకొని మరో చక్కటి ప్రణాళికతో లక్ష్యంవైపు అడుగు వేయండి. ఈ క్రమంలో మీలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఎటువంటి నిరాశ, అసూయ లేకుండా విజయం వైపు పయనిస్తారు.

Advertisement

Next Story