- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ గుండె పదిలమేనా..? గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి
దిశ, వెబ్ డెస్క్: మీ గుండె పదిలమేనా.. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె పోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం, డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, మద్యపానం, ధూమపానం, ఊబకాయం మొదలైనవి గుండె పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు వంటి తృణధాన్యాలను ఎక్కువగా తింటే మంచిది. ఫైబర్ తో పాటుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు తినే ఆహారంలో ఉప్పు తక్కువ వేసుకోవాలి.