- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవజాత శిశువులకు కూలర్, ఏసీ గాలి సురక్షితమేనా..
దిశ, ఫీచర్స్ : తల్లిదండ్రులు తమ నవజాత శిశువుకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని కోరుకుంటారు. మంచి పెంపకంతో పాటు మంచి జీవనశైలిని కూడా అందిస్తారు. ఇక వేసవి కాలం విషయానికి వస్తే వారికి సౌకర్యంగా ఉండేందుకు ఏసీ, కూలర్లను పెట్టి చల్లటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. దాంతో పిల్లలు వేసవి కాలంలో మంచి నిద్రను పొంది ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు. అయితే చాలా కుటుంబాల్లో పెద్దలు నవజాత శిశువుకు ఏసీ లేదా కూలర్లు అలవాటు చేయకూడదని అంటూ ఉంటారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి కూడా ఏసీ, కూలర్ల ముందు ఉండకూడదని చెబుతారు.
అసలు నవజాత శిశువులను ఏసీ, కూలర్ గాలిలో ఉంచడం మంచిదేనా అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. ఈ విషయంలో పీడియాట్రీషియన్ ఏం చెబుతున్నారంటే వేసవిలో వేడి గదులలో పిల్లలు ఉన్నట్టయితే జ్వరం లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే పిల్లలను సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడం చాలా ముఖ్యం. కానీ, కూలర్ లేదా ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం కూడా అంతే ముఖ్యం అని చెబుతున్నారు.
పిల్లలను కూలర్ లేదా ఏసీలో ఉంచడం సురక్షితమేనా ?
పిల్లలు ఉన్న గదిలో AC, కూలర్ ఆన్ చేయవచ్చు. ఇది పిల్లల్లో శిశు మరణ సిండ్రోమ్, డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే గది ఉష్ణోగ్రత సాధారణంగా ఉంచాలని గుర్తుంచుకోవాలి. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు పెద్దవారిలా తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేరని పీడియాట్రిషియన్లు తెలుపుతున్నారు. అందుకే వారిని సాధారణ గది ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలి.
పిల్లలకు సౌకర్యవంతమైన దుస్తులు వేయాలి..
మీరు పిల్లలను ఎల్లవేళలా ఏసీ లేదా కూలర్‌లో ఉంచినప్పుడు సౌకర్యవంతమైన దుస్తులను వేయాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్‌లో వారికి కాటన్ దుస్తులు వేయడం మంచిదంటున్నారు.
పిల్లలను AC లేదా కూలర్‌లో సురక్షితంగా ఉంచే చిట్కాలు..
- ఏసీ లేదా కూలర్లను రూం టెంపరేచర్ లో సెట్ చేయాలి. తద్వారా పిల్లలు ఎక్కువ వేడిగా లేదా చల్లగా ఉండదు.
- AC లేదా కూలర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు పిల్లలపై తేలికపాటి దుప్పటి లేదా షీట్‌ను కప్పాలి.
- మీ పిల్లల గదిలో కూలర్‌ని ఉపయోగిస్తుంటే, కనీసం ఒక విండో అయినా తెరిచి ఉంచాలి. తద్వారా గదిలోకి స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది, అలాగే తేమ పెరగదు.
- పిల్లల తల, ఛాతీ, చేతులు, కాళ్లను అతను కూలర్‌లో లేదా ఏసీలో సౌకర్యవంతంగా ఉన్నాడో లేదో చెక్ చేస్తూ ఉండాలి.
- కూలర్ లేదా ఏసీతో పాటు ఫ్యాన్‌ను నడుపుతుంటే, దాని గాలి నేరుగా పిల్లల పై పడకుండా చూసుకోవాలి.
ఎయిర్ కండీషనర్ లేదా కూలర్‌ని ఉపయోగించడం అనేది వ్యక్తిగత ఎంపిక. అయినప్పటికీ మీరు వాటిని ఉపయోగిస్తుంటే, మీ బిడ్డ సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.