ఉన్నట్టుండి భారీగా పెరిగిన చికెన్ ధరలు.. గగ్గోలు పెడుతోన్న జనాలు!!

by Anjali |
ఉన్నట్టుండి భారీగా పెరిగిన చికెన్ ధరలు.. గగ్గోలు పెడుతోన్న జనాలు!!
X

దిశ, ఫీచర్స్: ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులే ఎక్కువగా ఉంటారు. కొంతమంది వారంలో నాలుగు రోజులు వండుకొని తినేవారున్నారు. మటన్, చికెన్, చేపలు తింటుంటారు. కానీ ఇందులో ఎక్కువగా చికెన్ తినేందుకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అలాంటి చికెన్ ధరలు ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ వారంలో తగ్గిన ధరలు మరో వారం వచ్చే సరికి కొండెక్కుతున్నాయి. చికెన్ కొనాలంటే సాధారణ ప్రజలు పర్సు చూసుకునే పరిస్థితి ఎదురవుతుంది.

వీకెండ్ కు ముందు చికెన్ ధరలు చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అయితే నిన్న మొన్న తగ్గిన చికెన్ ధరలు.. తాజాగా అమాంతం పెరగడంతో మాంసం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. గత వారం చికెన్ స్కిన్ లెస్ 200 రూపాయలు నుంచి రూ. 220 వరకు పలికింది. విత్ స్కిన్ చికెన్ కిలో 180 రూపాయల నుంచి రూ. 200 వరకు ఉంది. తాజాగా హైదరాబాదులో బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ కిలో రూ. 260 కి పెరిగింది. విత్ స్కిన్ నేడు రూ. 240 గా ఉంది. ఈ రేట్లు చూసి నాన్ వెజ్ ప్రియుడు నోరెళ్లబెడుతున్నారు.

Advertisement

Next Story