పిల్లల్లో మెమోరీ పవర్ పెరగాలా?.. ఈ ఆహారాలు తప్పక పెట్టండి!

by Javid Pasha |
పిల్లల్లో మెమోరీ పవర్ పెరగాలా?.. ఈ ఆహారాలు తప్పక పెట్టండి!
X

దిశ, ఫీచర్స్ : ఇంతకాలం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసిన పిల్లలు ఇప్పుడు స్కూల్ బాట పట్టారు. పొద్దున్న హడావిడిగా లేవడం బ్యాగు భుజానికేసుకొని వెళ్లడం, తిరిగి వచ్చాక హోం వర్క్ చేయడం ఇలా క్షణం తీరికలేకుండా గడిపేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పిల్లలు తినడం తక్కువ చేస్తుంటారు. కొందరు పేరెంట్స్ కూడా తగిన సమయం కుదరక మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ చేసి పెడ్తుంటారు. రుచికరమైన టిఫిన్స్, స్నాక్స్‌కు అలవాటు పడి, పోషకాలు కలిగిన భోజనాన్ని, ఇతర ఆహారాలను పిల్లలు కూడా అవైడ్ చేస్తుంటారు. కానీ ఇది వారి మెమోరీ పవర్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. తగిన పోషకాలు లభించకపోతే జ్ఞాపక శక్తి, ఎదుగుదల తగ్గిపోయి చదువులో వెనుకబడే చాన్స్ ఉంటుంది. అలా జరగకూడదంటే ఆహారంలో భాగంగా వేటిని ఎక్కువగా తీసుకోవాలో చూద్దాం.

ఆకు కూరలు

ఆకు కూరలు సహజంగానే పిల్లల మెదడు ఆరోగ్యానికి మంచిది. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ పిల్లల్లో మెదడు ఎదుగులకు దోహదం చేస్తాయి. మెమోరీ పవర్‌ను పెంచుతాయి. కాబట్టి ఆహారంలో భాగంగా పిల్లలకు ఇవ్వాలి.

గుడ్లు, చేపలు

పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తికి గుడ్లు మంచి పోషకాహారం. వీటిలోని పచ్చ సొనలో కోలిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే విటమిన్ బి6, విటమిన్ బి12 పిల్లల్లో రక్తహీనతను తగ్గిస్తాయి. శారీక ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. అన్ని విధాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక చేపల విషయానికి వస్తే వీటిలో హెల్తీ ప్రోటీన్స్, గుడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. సార్డినెస్, మాకేరెల్, సాల్మన్ వంటి చేప రకాల్లో ఒమేగా -3 యాసిడ్స్ కూడా ఫుల్లుగా ఉంటాయి. పాలల్లో కూడా అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు పిల్లలకు ఇవ్వడం మంచిది. ఇవన్నీ జ్ఞాపక శక్తిని పెంచుతాయి.

వేరు శనగ, ఓట్స్

వేరు శనగ లేదా పల్లీలతో తయారు చేసిన ఆహారాలు పిల్లలకు మంచిది. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటంవల్ల ఇది నరాలకు ప్రేరణగా నిలుస్తుంది. మెదడు పనితీరుకు అవసరమైన థయామిన్ కూడా వేరు శనగలో ఫుల్లుగా లభిస్తుంది. అలాగు తృణ ధాన్యాలు కూడా ఆహారంలో భాగంగా ఉపయోగించాలి. వీటిలో ఏకాగ్ర, శ్రద్ధ పెరిగేందుకు అవసరమైన ఫోలేట్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల ఓట్స్ వినియోగం పిల్లలకు, పెద్దలకు కూడా మంచిది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే మెదడుకు ఎనర్జీని ఇవ్వడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఓట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.

Advertisement

Next Story