Blood Pressure : బ్లడ్ ప్రెజర్ పెరుగుతోందా? ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసుకోండి

by Javid Pasha |
Blood Pressure : బ్లడ్ ప్రెజర్ పెరుగుతోందా? ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసుకోండి
X

దిశ, ఫీచర్స్ : అసలే ఎండలు దంచి కొడుతున్నాయ్.. బయట ఎక్కువ సేపు తిరిగితే వడదెబ్బ కొడుతుంది జాగ్రత్త అంటుంటారు పెద్దలు. అంతేకాదు సమ్మర్ సీజన్‌లో కొందరికి బ్లడ్ ప్రెజర్ కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అధిక ఉష్ణోగ్రతలవల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురికావడమే ఇందుకు కారణం. పైగా ఈరోజుల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న సమస్యల్లో బీపీ కూడా ఒకటి. పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలతో ముడిపడి ఉన్నందున దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. అయితే కొన్ని రకాల ఆహారపు అలవాట్లు కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు దోహద పడతాయని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

*నీళ్లు ఎక్కువగా తాగండి : సమ్మర్‌లో బీపీ పెరగానికి మరో ప్రధాన కారణం. సరిపడా నీరు తాగకపోవడం. ఎందుకంటే బాడీలో నీటిశాతం తగ్గితే రక్త ప్రసరణలో ప్రతికూల మార్పులు సంభవిస్తాయని, డీహైగ్రేషన్‌కు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే సరిపడా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల వాటర్ తాగితే శరీరంలో నీటిశాతం పడిపోకుండా ఉంటుంది.

* ఉప్పు అధికంగా వాడొద్దు : ఉప్పు ఆరోగ్యానికి మంచిది. దీనిని తినడం మానేస్తే బాడీలో సోడియం లెవెల్స్ తగ్గితే అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే ఇదంతా ఓ పరిమితి స్థాయిలో వాడినప్పుడు మాత్రమే. అంతకు మించి వాడితే మాత్రం అధిక రక్తపోటుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. అందుకే తినే ఆహారంలో లిమిట్‌కు మించి ఉప్పువాడవద్దంటున్నారు. ముఖ్యంగా సమ్మర్‌లో సాల్టీఫుడ్స్ అస్సలే తినవద్దు. ఇవి బీపీని పెంచుతాయి. బదులుగా అరటిపండ్లు, సంత్రాలు, వాటర్ మిలన్ సహ అన్ని రకాల పండ్లు తినవచ్చు. వంకాయ, బీరకాయ వంటి పొటాషియం, ఫైబర అధికంగా ఉండే ఆహారాలు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది.

*పెరుగు, మజ్జిగ : పెరుగు, మజ్జిగ వంటివి వేసవిలో చలువ చేయడమే కాదు, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో మెగ్నీషియం, ప్రొటీన్ లెవెల్స్ ఫుల్లుగా ఉంటాయి. జీర్ణక్రియకు మేలు చేసే పోషకాలు కూడా ఉంటాయి. పెరుగుతోపాటు కర్బూజ గింజలు, గుమ్మడి గింజలు, దానిమ్మ గింజలు వంటివి కూడా బీపీని కంట్రోల్ చేస్తాయి.

*జంక్ ఫుడ్స్ : బ్లడ్ ప్రెజర్ పెరగడంలో జంక్ ఫుడ్స్ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు వేసవిలో వాటిని తినకపోవడం మంచిది. పైగా వీటిలో సోడియం స్థాయికి మించి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి హానికరం. బీపీ పెరగకుండా ఉండాలంటే జంక్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేసి, హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు నిపుణులు.

*టీ, కాఫీలు వద్దు : టీ, కాఫీ తాగనిదే కొందరికి పొద్దుపోదు. అయితే సమ్మర్‌లో తాగకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. వీటిలోని అధిక కెఫిన్ రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరిగేందుకు దారితీస్తుంది. పరోక్షంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ పానీయాల జోలికి వెళ్లకపోవడం మంచిది. తాగకుండా ఉండలేం అనుకునేవారు ఒకటీ రెండు కప్పులకు పరిమితం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed