- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ మిస్ ఇచ్చిన అద్బుతమైన గిఫ్ట్.. చివరికి ఇలా చేశారు.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః స్కూల్ పిల్లలకి జీవించడాన్ని నేర్పాలి. ఆత్మ విశ్వాసం, ఆనందంతో పాటు నైపుణ్యాన్ని నేర్పాలి. ఇలా చేయాలంటే పిల్లల సంతోషమే నా సంతోషం అనుకునే తల్లిదండ్రుల లాంటి టీచర్ కావాలి. అయితే, ఈ లక్షణాలు, ఇలాంటి ఆలోచనలు ఉన్న టీచర్లు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ, ఈ వీడియోలో ఒక టీచర్ తన విద్యార్థులకు సహాయం చేయడానికి అదనపు మైలు ఎలా నడిచిందో తెలిపే మధురమైన వీడియో మీ హృదయాలను గెలుచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో స్కూల్ మిస్ తన తరగతిలో విద్యార్థులందరికీ కొత్త షూలను బహుమతిగా ఇస్తుంది. "టీచర్ కొత్త స్నీకర్లతో మొత్తం తరగతిని ఆశ్చర్యపరుస్తుంది: అంటూ @teachinthe6ix ఇలా రాశారు: 'నా విద్యార్థులు అన్ని విభిన్న రంగాల నుండి వచ్చారు. వీరిలో కొంతమందికి మనం తరచుగా కొనుక్కునే షూస్ వంటి సాధారణ విలాసాలు ఉండవు'" అని ఆమె రాసిన విశేషాల్లో ఒక భాగం చెబుతుంది. ఆమె ఈ బహుమతులు ఇవ్వడానికి తగినంత నిధులను సేకరించింది. ఇక, విద్యార్థులు తమ షూస్‌ను డిజైన్ చేసి, ఆ అద్భుతమైన బహుమతిని మరింత అద్బుతంగా అలంకరిస్తారు. నిజంగా, ఆమె ఎంత అద్భుతమైన గురువు!! అందుకే , చాలా మంది నెటిజనులు ఈ టీచర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.