- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపైన పడిపోతే ఎవరైనా బాధపడతారు.. కానీ, ఈ బుడ్డోడు చూడండి (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః వెళ్తూ వెళ్తూ అనుకోకుండా మనం నడిపై వాహనం నుండి రోడ్డుపైన పడిపోతే ఎవ్వరైనా ఏం చేస్తారు. గాయపడితే బాధపడతాం, లేకపోతే, ఎవరైనా చూసుంటారేమో అనుకుంటూ సర్థుకొని, వెళ్లిపోతాం. కానీ, ఇక్కడొక బుడతడు మాత్రం అన్నింటికీ భిన్నంగా చేశాడు. తన సైకిల్ పైనుండి పడిపోయిన తర్వాత బుడ్డోడు పైకిలేచి, హిస్టీరికల్ డ్యాన్స్‌తో షేక్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మంగళవారం ట్విట్టర్లో షేర్ చేసిన ఈ చిన్న క్లిప్ ఇప్పటికే ఐదు మిలియన్లకు పైగా వ్యూవ్స్, 200,000 లైక్‌లను పొందింది. వీడియోలో ఒక పిల్లోడు సైకిల్ తొక్కుతుంటాడు. కొన్ని సెకన్ల తర్వాత, అతను బ్యాలెన్స్ కోల్పోవడంతో రోడ్డుపై పడిపోతాడు. పిల్లాడు లేచి, ఏడవడానికి బదులుగా అద్బుతంగా డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు. "జీవితం మిమ్మల్ని సవాలు చేసినప్పుడు మీరు ఇలా స్పందించాలి !" అనే క్యాప్షన్‌తో వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది. హార్ట్ ఎమోజీలతో చాలా మంది వినియోగదారులు ఈ పిల్లాణ్ణి "లెజెండ్" అని పిలుస్తున్నారు. ఇంకొందరు "రాక్‌స్టార్" అంటున్నారు.
This should be your reaction when life challenges you! 👍😂😂pic.twitter.com/LusfAgVe96
— Figen (@TheFigen) July 26, 2022