మొబైల్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?

by Jakkula Samataha |
మొబైల్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతోంది. మొబైల్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ఉదయం లేచిన తర్వాత మొదలు, రాత్రి పడుకునే వరకు ఫోన్ చూస్తునే గడుపుతున్నారు.అయితే ఇలా పదే పదే ఫోన్ చూడటం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి.

ముఖ్యంగా ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ కేసులు అధికంగా పెరుగుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ అధికంగా చూడటం వలన బ్రెయిన్‌లో కణితిలు ఏర్పడి, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంది అంటున్నారు నిపుణులు.ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ సంస్థ చెబుతున్న ప్రకారం మన దేశంలో బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్న వారిలో 24 వేల మంది ఏటా మరణిస్తున్నట్టు అంచనా. అలాగే ఏటా 50000 కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ రావడానికి అనేక కారణాలు ఉన్నా, అందులో మొబైల్ ఫోన్ కూడా ఒకటని సమాచారం. మెదడులో కణితులు ఎందుకు వస్తాయనేదానికి సరైన కారణాలు లేవు కానీ, రేడియేషన్‌కు తీవ్రంగా గురి కావడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉందనే వాదన ఉంది. కేవలం ఫోన్ వల్లే బ్రెయిన్లో ట్యూమర్లు వస్తాయి అనడానికి ఇంకా సరైన ఆధారం లభించలేదు. కానీ ఫోన్ వాడకం మాత్రం మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా చెడగొడుతుందని మాత్రం అధ్యయనకర్తలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed