- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heart attack : చల్లటి నీళ్లతో స్నానం.. గుండెపోటుకు మార్గం!
దిశ, ఫీచర్స్: ప్రజలకు సీజన్ ఆధారంగా స్నానపు అలవాట్లు మారుతుంటాయి. చలికాలం ప్రారంభంకాగానే వేడి నీళ్లతో స్నానం చేయడం. వేసవిలో చల్లటి నీటితో స్నానం చేయడం మంచిదికాదు. ఈ రెండు పద్ధతులు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఈ రెండు పద్ధతులు మీ ఆరోగ్యంపై, చర్మంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరగకుండా నిరోధిస్తాయి. శరీరంలో ఉత్పన్నమయ్యే వేడిని తగ్గిస్తాయి. అందుకే ఏ సీజన్‌లో ఎలాంటి నీటిని ఉపయోగించాలో తెలుసుకుందాం.
1. చాలామంది చర్మ సౌందర్యం కోసం చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. కానీ, చల్లటి నీరు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ స్థితిలో రక్తపోటు వేగంగా పెరిగి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేస్తే బీపీ వేగంగా పడిపోతుంది. గుండెను ఒత్తిడికి గురి చేస్తుంది. తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుంది.
2. అలాగే వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మంపై ముడతలు, దురద లేదా దద్దుర్లు కూడా వస్తాయి. దీంతో యవ్వనంలోనే ముసలివారిలా కనిపిస్తారు. మొటిమలు ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. నీళ్లు మరీ వేడిగా ఉంటే తలపై రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. దీనివల్ల జుట్టు పెరుగుదల మందగించి హెయిర్ ఫాల్ మొదలవుతుంది.
3. ఇక కొందరు ఏ సీజన్ అయినా చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఒక్కోసారి వారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇలా చలికాలంలో కూడా చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒక్కోసారి పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు. ఇలా మరణించిన సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటా. అందువల్ల సున్నితంగా ఉండేవారు, చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయకపోవడం మేలు.
అందుకే ఈ ప్రమాదాల బారిన పడకూడదంటే సీజన్ ఏదైనా సరే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం.