- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సింపుల్ ఫుడ్ తింటే.. యవ్వనం మీ సొంతం!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి యంగ్‌గా కనిపించాలనే కోరిక ఉంటుంది. కానీ, ప్రస్తుత జీవన విధానంలోని మార్పులు, వాతావరణ కాలుష్యం, మేకప్ వంటి వాటి వల్ల కొందరు తమ వయస్సు కంటే పెద్దగా కనిపిస్తారు. అంతేకాకుండా ఏది పడితే అది తింటూ..శరీరంపై శ్రద్ధ చూపరు. మరికొందరు కేవలం వర్కౌట్లు మాత్రమే చేస్తుంటారు. వాటితో పాటుగా సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంతో పాటుగా కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల వృద్ధాప్య ఛాయలను తగ్గించుకునే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చదివేయండి.
సాల్మన్: ఇందులో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజు వారి ఆహారంలో భాగంగా వినడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాకుండా స్కిన్ యవ్వనంగా, హైడ్రేట్‌గా కనిపిస్తుంది.
తాజా ఆకుకూరలు: తాజాగా ఉన్న ఆకుకూరలు చర్మం మెరుపును పెంచడంలో సహాయపడతాయి. పాలకూర, బచ్చలికూర వంటి గ్రీన్ ఆకుకూరలలో విటమిన్-ఎ, విటమిన్-సి, జింక్, ఐరన్, కాల్షియం, విటమిన్-కే, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల రక్తం ఉత్పత్తి మెరుగుపడి, ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా చర్మాన్ని మరింత అందంగా మార్చడానికి ఇవి సహాయపడతాయి.
గింజలు: బాదం, జీడిపప్పు, పిస్తా, బ్రెజిల్ నట్స్ వంటి గింజలను రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల ప్రయోజం ఉంటుంది. ప్రతీరోజు కనీసం ఒకటి నుండి రెండు సార్లు వీటన్నింటిని కలిపి కొంత మోతాదులో తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది.
పెరుగు: పెరుగులో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉండి, జీవక్రియకు సహాయపడే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పెరుగులోని ఫాస్పరస్, రైబోఫ్లావిన్, కాల్షియం, విటమిన్-బి12 పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజు తినడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు, గీతలను తగ్గించి, చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.
అవకాడో: అవకాడో చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, మోనోశాచురేటెడ్ వంటి కొవ్వులు, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
పండ్లు: ఆరోగ్యంగా, యంగ్‌గా కనపించాలంటే పండ్లు తినడం మంచిది. ప్రతీ రోజు రెండు మూడు రకాల పండ్లను బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా స్కాక్ టైమ్‌లో తీసుకోవడం మంచిది. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపించి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.