పడుకునే ముందు ఇలా చేస్తే యవ్వనంగా కనిపిస్తారు !

by samatah |   ( Updated:2023-02-02 12:18:13.0  )
పడుకునే ముందు ఇలా చేస్తే యవ్వనంగా కనిపిస్తారు !
X

దిశ, ఫీచర్స్ : చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా తమ ముఖం, శరీరం యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల లోషన్లు, క్రీములు వాడుతుంటారు. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకోవడంతోపాటు ఫలితం ఎలా ఉంటుందో తెలీదంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. ఇంట్లోనే పాటించే కొన్ని ట్రెడీషనల్ బ్యూటీ టిప్స్‌వల్ల ముఖ, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చని చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

ముఖ వర్ఛస్సు కోసం

పిడికెడు లేదా ఒక కప్పు మున‌గాకుల్ని తీసుకోవాలి. వాటిని మెత్తగా నూరడం ద్వారా వచ్చే రసాన్ని సేకరించి, రోజూ పడుకునే ముందు ముఖానికి, మెడ భాగంలో అప్లయ్ చేయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ ఇలా చేయడంవల్ల ముఖంపై, మెడపై నలుపు ఛాయలు, మొటిమలు, ముడతలు క్రమంగా తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా కనిపిస్తుంది.


కళ్లకింద నలుపు పోవాలంటే..

కొందరిలో కళ్లకింద లేదా కళ్ల చుట్టూ ముడతలు లేదా నల్లబడటం కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న కప్పులో పాలను తీసుకొని, అర స్పూన్ తేనె క‌లిపి ముడతలు, నలుపు ఉన్న భాగాల్లో నిద్రకు ముందు అప్లయ్ చేయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంరోజుల్లో సమస్య దూరం అవుతుంది.

పెదవులపై పగుళ్లకు

పెద‌వులు తడి ఆరిపోయినట్టుగానో, పగుళ్లుగానో అనిపిస్తే అందం దెబ్బతింటుంది. ఇలాంటివారు పడుకునే ముందు అలోవెరా జ్యూస్ అప్లయ్ చేసి, రెండు గంటల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. క్రమంగా పెదవులు సాధారణ స్థితికి వస్తాయి. ఈ విధమైన టిప్స్‌తోపాటు తరచూ పౌష్టికాహారం, తాజా పండ్లు తీసుకుంటూ ఉండటంవల్ల కూడా చర్మ సౌందర్యం, ముఖ వర్ఛస్సు పెరిగే అవకాశాలు ఉంటాయని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story