చప్పట్లు కొడితే పైకి వస్తున్న చెరువులోని నీరు.. ఎక్కడో తెలుసా?

by Anjali |
చప్పట్లు కొడితే పైకి వస్తున్న చెరువులోని నీరు.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ప్రకృతి సృష్టించిన మనకు తెలియని వేల రహస్యాలు దాగి ఉంటాయి. గుడి అయినా, మసీదు అయినా, పర్యాటక ప్రదేశాల్లోనైనా వింతలు చూస్తుంటాం. కానీ, అవి సమయం వచ్చినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తాయి. ఇలాంటి వింతైన ఓ చెరువు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెరువు వద్ద చప్పట్లు కొట్టితే చాలు నీళ్లు ఆటోమెటిక్‌గా పైకి లేస్తాయట. భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన ఈ చెరువు జార్ఖండ్‌లోని బొకారో నగరానికి 27 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని అందరూ దలాహి కుండ్ అని పిలుస్తారు.

ఈ కుండ్‌లోని నీరు సీజన్‌ను బట్టి మారుతూ ఉంటాయి. వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటాయి. ఈ చెరువు నీళ్లలో స్నానం చేస్తే చర్మ రోగాలు దూరం అవుతాయట. ఈ కుండ్‌‌లో స్నానం చేయడానికి దూర ప్రాంతాల నుంచి జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ ‘‘గోసాయి దేవతను పూజిస్తారు. ప్రతి ఆదివారం పూజలు చేస్తారట. అలాగే ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున ఇక్కడ ఘనంగా జాతర కూడా జరుగుతుందట. దీనిపై అనేక పరిశోధనలు జరిగినా.. ఈ చెరువులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో ఇప్పటి వరకు తెలియదు. ధ్వని తరంగాల వల్ల కలిగే కంపనాలు నీటిని పైకి లేస్తున్నాయంటే.. ఇక్కడ నీరు తక్కువ ఉండడం వల్ల కావచ్చంటూ కొందరు పరిశోధకుల అంచనా. ప్రస్తుతం ఈ దలాహి కుండ్‌కు చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మించారు. అక్కడి ప్రజలు ఇప్పటికి కూడా ఈ ప్లెస్‌ను ఎంతో విశ్వాసంగా భావిస్తారు. ఆ కొలనులో స్నానం చేస్తే తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

Also Read: అయ్యో అలా జరిగిందేమిటి!.. ఆధునిక జీవితంలో భాగమవుతున్న పొరపాట్లు

వరండాలో కూర్చొని స్మోక్ చేస్తే .. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందా?



Next Story