- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాత్రి నిద్ర పట్టటం లేదా.. అయితే ఈ విటమిన్ లోపం కావొచ్చు.. వీటిని తినండి!
దిశ, ఫీచర్స్ : చాలా మంది రాత్రిపూట నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. అందరూ నిద్రపోతున్నప్పుడు, వారు గది చుట్టూ తిరుగుతూ నరకం అనుభవిస్తారు. మంచి నిద్ర కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. కొంత మంది నిద్రమాత్రలను వాడుతుంటారు.అయితే, నిద్రలేమి సమస్యకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా శరీరంలో విటమిన్లు లోపం వలన నిద్రలేమి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ B12 లేకపోవడం ప్రధాన కారణమని అంటున్నారు. ఈ రుగ్మత ఉన్నవారు సరిగా నిద్రపోలేరు. దీంతో పగటిపూట అలసటగా అనిపిస్తుంది. అందువల్ల, విటమిన్ బి 12 లోపం ఉన్నవారు విటమిన్ బి 12 ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా నిద్రలేమి నుండి ఉపశమనం పొందవచ్చు.
శాకాహారులు విటమిన్ బి12 పొందడానికి పాలకూర, దుంపలు, పుట్టగొడుగులు, బంగాళదుంపలను ఫుడ్ డైట్ లో చేర్చుకోవాలి. మీరు మాంసాహారులు అయితే, విటమిన్ బి 12 పొందడానికి మీరు సాల్మన్ వంటి చేపలను తీసుకోవాలి. వీటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఉడికించిన గుడ్లు తినడం వల్ల విటమిన్ బి12 కూడా లభిస్తుంది. పాల ఉత్పత్తులలో కూడా ఈ విటమిన్ లభిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.