కొత్తగా పెళ్లైన మహిళలు హోలీని అత్తారింట్లో జరపుకున్నారంటే.. ఈ సమస్యలు తప్పవు?

by Jakkula Mamatha |
కొత్తగా పెళ్లైన మహిళలు హోలీని అత్తారింట్లో జరపుకున్నారంటే.. ఈ సమస్యలు తప్పవు?
X

దిశ, వెబ్‌డెస్క్ : హోలీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. మనకు నచ్చిన రంగులతో మన స్నేహితులు, చుట్టాల వారితో చాలా సరదాగా ఆడుకుంటాము. ఇక హోలీ సెలబ్రేషన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు.ఇక ఫాల్గుణ మాసంలో వచ్చే పూర్ణిమ రోజు ఈ హోలీ పండుగ జరుపుకుంటారు.ఇక ఈ సంవత్సరం మార్చి 25న హోలీ పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. అయితే మీకు తెలుసా? కొత్తగా పెళ్లైన వారు హోలీని అత్తవారింట్లో జరుపుకోకూడదు అంటారు. ఎందుకో తెలుసా?

హోలికా దహనాన్ని కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తమ అత్తవారింట జరుపుకోకూడదు, చూడకూడదని ఒకవేళ పొరపాటున అత్తాకోడళ్లు కలిసి హోలికా దహనం చూస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతాయంటున్నారు పండితులు. అంతేకాదు హోలికా దహనాన్ని గర్భిణీలు కూడా చూడకూడదంట. ఇక కొత్తగా పెళ్లైన మహిళలు తమ భర్తతో పుట్టింట్లో హోలీ పండుగను జరుపుకుంటే చాలా మంచిదంట.నూతన వధువు తన తల్లిదండ్రులతో మొదటి హోలీ ని జరుపుకుంటే అది తమ భవిష్యత్తు శుభసూచకమని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed