- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ లక్షణాలు ఉన్న మగవారు జర జాగ్రత్త.. గుర్తించకపోతే ప్రమాదమే?
దిశ, ఫీచర్స్ : చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతగా లక్షణాలు కనిపించకపోవడంతో చిన్నదే కధా అని లైట్ తీసుకుంటారు. కానీ చివరకు అదే పెద్ద సమస్యగా, ప్రాణాంతక వ్యాధిగా మారుతోంది. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మగవాళ్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట, ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి అంటున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.సాధారణంగా అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, బరువు తగ్గడం లాంటివి షుగర్ వ్యాధి లక్షణాలు. కానీ పురుషులలో ఈ నాలుగు లక్షణాలు ఉన్నా డయాబెటిస్ ఉన్నట్లేనంట. అందువలన 30 ఏళ్లు పైబడిన వారు ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలే నెగ్లెట్ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
1. అరికాళ్లలో మంట : చాలా మంది అరికాళ్లలో మంటను లైట్ తీసుకుంటారు. అయితే రాత్రి సమయంలో అరి కాళ్లలో మంట ఎక్కువగా అనిపిస్తే డయాబెటిస్ ఉన్నట్లేనంట.
2.గాయాలు మానకపోవడం : ఏదైనా చిన్న గాయం అయితే రెండు మూడు రోజుల్లో మానిపోతుంది. కానీ గాయం అస్సలే మానకుండా, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తే షుగర్ వ్యాధి ఉన్నట్లేనంట.
3. స్పర్శ తగ్గడం: మధుమేహం కారణంగా నరాలు దెబ్బతింటే కాళ్లు, పాదాలలో సెన్సేషన్ ఫీలింగ్ తగ్గుతుంది. గాయాలు లేదా అసౌకర్యాన్ని గమనించడం సవాలుగా మారుతుంది. ఈ తగ్గిన సున్నితత్వం వల్ల ఇన్ఫెక్షన్ సంకేతాలను గుర్తించలేరు, వీటికి చికిత్స పొందకపోతే తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
4 లెగ్ క్రాంప్స్ : కాళ్ల తిమ్మిరి రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. దీంతో చాలా మంది తిమ్మిర్లు చాలా లైట్ తీసుకుంటారు. అయితే రక్తంలో అధిక చక్కెర ఉన్న మగవారికి తరచుగా లెగ్ క్రాంప్స్ వస్తాయంట.