సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన టమాట ధరలు.. కిలో ఎంతంటే?

by Anjali |
సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన టమాట ధరలు.. కిలో ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గత సంవత్సరం టమాటా సాగు చేసిన రైతులు లక్షాధికారులయ్యారు. ఒక్కసారిగా టమాటా ధరలు ఏకంగా రూ. 150 కు చేరుకున్నాయి. దీంతో టమాటా సాగు చేసిన రైతుల పంట పండితే.. సామాన్యులు మాత్రం టమాటా కొనేందుకు వెనకడుగేశారు. పోయిన ఏడాది లాగే ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు సామాన్యులకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ధర 55 నుంచి 60 రూపాయల మధ్య పలుకుతుంది. రీసెంట్ గా చిత్తూరు జిల్లా అంగళ్లు టమాటా మార్కెట్‌లో 25 కిలోల బాక్స్‌.. రూ. 1400 పలికింది. దీన్ని బట్టి చూస్తే.. కిలో టమాటా ఏకంగా 56 రూపాయలు అన్నమాట. ఇక మదనపల్లి టమాటా మార్కెట్‌ యార్డ్‌లో 25 కిలోల బాక్స్‌ 1300 గా పలికింది. కాగా కిలో టమాటా రూ. 52. వీటితో పాటు పుంగనూరు, మొలకలచెరువు మార్కెట్‌ యార్డ్‌లో కూడా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో టమాటా పండించిన రైతులు సంతోషాన్ని వ్యక్తం చేయగా.. సామాన్యులు, పేద, మధ్య తరగతి వారు మాత్రం టమాటా కొనాలంటే జంకుతున్నారు.

Advertisement

Next Story