Yoga : పరివృత్త పార్శ్వకోనాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

by srinivas |   ( Updated:2022-09-12 06:33:14.0  )
Yoga : పరివృత్త పార్శ్వకోనాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?
X

పరివృత్త పార్శ్వకోనాసనం:

మొదట బల్లపరుపు నేలపై రెండు కాళ్లు దగ్గరగా పెట్టి నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత రెండు కాళ్లను సాధ్యమైనంత దూరం జరపాలి. ఇప్పుడు కుడికాలు మోకాలిని వంచి ఎడమకాలును ఎడమవైపు నిటారుగా సాగదీయాలి. ఎడమ పాదంతో నేలను అదిమిపట్టుకుని శరీరాన్ని కుడి తొడపై బ్యాలెన్స్ చేయాలి. తర్వాత కుడి చేతిని కుడి తొడపై ముందు నుంచి వెనక్కి తీసుకెళ్లాలి. ఎడమ చేతిని వీపు వెనకాల నుంచి తీసుకొచ్చి కుడిచేయి అరచేతిని పట్టుకోవాలి. ఇలా రెండు చేతులను బలంగా జోడించి శరీరాన్ని సాధ్యమైనంతగా కుడి వైపు వంచాలి. ఈ భంగిమలో ఎడమకాలు నిటారుగా ఉండాలి. కుడికాలు పాదం కుడివైపు చూస్తుండాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి ఎడమవైపు చేయాలి.

ప్రయోజనాలు:

* కాళ్లు, మోకాలు, చీలమండలను బలపరుస్తుంది.

* ఉదర అవయవాలను సక్రియం చేస్తుంది.

* శరీరంలో అధిక కొవ్వు తగ్గిస్తుంది.

* జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed