- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాప్ పోలీసు బాసులకు స్థానచలనం ?
దిశ, సిటీ క్రైమ్ : ఊరిస్తున్న పోలీసు శాఖలోని ఐపీఎస్ ల బదిలీల అంశం కొత్త సంవత్సరంలో కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఐపీఎస్ ల బదిలీలు ఉంటాయని పోలీసు వర్గాల్లో ఎవరు ఎదురు పడ్డా ఇదే మెయిన్ టాపిక్ అయ్యింది. ఇందులో మరో హాట్ టాపిక్ కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లో వైరల్ మారింది. రాష్ట్ర స్థాయితో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని కీలక హోదాల్లో ఉన్న పోలీసు బాసుల బదిలీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ స్థాయిలో పదవీ విరమణ దగ్గర్లో ఉన్న వారికి పోస్టింగ్ కల్పించాలనే సానుకూలతతో ఉన్న ప్రభుత్వం నిర్ణయంతో సీనియర్, జూనియర్ అనే భావన వస్తుండడంతో ఈ కీలక స్థాయిలో ఉన్న పోలీసు బాసుల బదిలీలు ఉంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఇతర ఐపీఎస్ ల విషయానికి వస్తే ఎవరు ప్రయత్నం వారు జోరుగా చేసుకుంటున్నారని సమాచారం. ఇలా గ్రేటర్ హైదరాబాద్, ఆనుకుని ఉన్న శివారు జిల్లాలతో పాటు పట్టణాభివృద్ధితో దూసుకుపోతున్న జిల్లాల పోస్టింగ్ లు సంపాదించాలనే ఆశతో ఐపీఎస్ పరుగులు పెడుతున్నారని తెలిసింది.
ఇలా పోటీ పడుతున్న తరుణంలో ఒకరి పై ఒకరు వారి కరప్షన్ తో పాటు ఇతర బిహేవియర్ లకు సంబంధించిన సీక్రెట్స్ ను కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి లీక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా పోస్టింగ్ లు వారికే దక్కాలా అనే కోణంలో ఎవరికి వారు స్కెచ్ లు వేస్తున్నట్లు పోలీసు వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇలా ఐపీఎస్ లు వారి పోస్టింగ్ ల కోసం ప్రయత్నిస్తుంటే ఏ అధికారి మాకు వస్తాడో ఆ తర్వాత మా పోస్టింగ్ లు ఉంటాయా లేదా ట్రాన్స్ ఫర్ అవుతుందా అనే అనుమానంతో ఇన్స్ పెక్టర్ లు వారి ప్రయత్నాలకు ఇప్పటి నుంచే స్కెచ్ లు వేస్తున్నారు. ఈ విధంగా పోలీసు శాఖలోని బదిలీల వ్యవహారం గత 3 నెలల నుంచి ఇదిగో ఈ రోజు ఆర్డర్ వచ్చేస్తుంది, రేసు వస్తుందంటూ ప్రచారం చక్కర్లు కొట్టింది. తాజాగా పోలీసుల వార్షిక నివేదికలను విడుదల సమయంలో క్రైం రేటు పెరిగిన సంఖ్యనే చాలా కనపడింది.
అందులో హత్యలు, రేప్ లు , కిడ్నాప్ లు వంటి కీలక అంశాల్లో కూడా పెరుగుదల ఉండడంతో ఆ పాయింట్ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడంతో ప్రభుత్వం ఈ బదిలీల్లో వాటిని పరిగణలోకి తీసుకుని పోస్టింగ్ లు కల్పిస్తుందనే వాదన కూడా ఉంది. అంతే కాకుండా ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు జాతీయ స్థాయిని చూసేలా చేయడంతో వాటి వెనకాల ఉన్న అసలు నిజాలను సేకరించి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా కీలక ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తుందని కూడా పోలీసు వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా అంతర్జాతీయంగా హైదరాబాద్ కు పేరు ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతల అంశంలో పటిష్టంగా ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిభ, వృత్తి నైపుణ్యం ఉన్న పోలీసు లకు పోస్టింగ్ లు ఇస్తేనే హైదరాబాద్ బ్రాండ్ కు మరింత ప్రతిష్ఠ పెరిగే ఛాన్స్ ఉంటుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. వెయిటింగ్ ఫర్ ఐపీఎస్ పోస్టింగ్స్ అంటూ ఇప్పుడు మొత్తం పోలీసు శాఖలోని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.