పత్తి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన...

by Sumithra |
పత్తి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన...
X

దిశ, చండూరు : సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో పత్తి కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని బంగారి గడ్డ గ్రామంలో గల మంజిత్ కాటన్ మిల్ లో ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. గురువారం అధికారులు, యాజమాన్యం విరుద్ధ ప్రకటనలతో కొనుగోళ్లు నిలిచిపోవటంతో రైతులు అయోమయానికి గురయ్యారు. గత కొన్ని నెలలుగా పత్తి కొనుగోలు చేస్తున్న అధికారులు నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ సెలవు ప్రకటించటంతో పత్తి కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు, తిరిగి రెండో తేదీన కొనుగోలు చేయనునట్లు మార్కెట్ అధికారులు మిల్లు వద్ద నోటీసు పెట్టారు. దీంతో రెండో తేదీన రైతులు భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా పత్తి తీసుకు వచ్చారు. కానీ మిల్ లో డిసెంబర్ 31 న అగ్ని ప్రమాదం జరగగా మరమ్మత్తులు చేసే సమయంలో ఆపరేటర్ కు గాయాలు కావటంతో పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు మిల్ యాజమాన్యం ప్రకటించటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు చేయాలని రైతులు యాజమాన్యాన్ని కోరగా వారు ససేమిరా అనడంతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులు స్పందించి పత్తి కొనుగోళ్లు చేపట్టేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed