Delhi Cafe Owner Dies: బెంగళూరు టెకీ తరహాలో.. ఆత్మహత్య చేసుకున్న మరో భార్యా బాధితుడు

by Ramesh N |   ( Updated:2025-01-02 07:15:10.0  )
Delhi Cafe Owner Dies: బెంగళూరు టెకీ తరహాలో.. ఆత్మహత్య చేసుకున్న మరో భార్యా బాధితుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భార్య వేధింపులకు తాళలేక బెంగూరులో సాఫ్ట్‌వేర్ అతుల్ సుభాష్ (Atul Subhash) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మరువకముందే అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధానిలో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఢిల్లీలో ఉడ్ బాక్స్ కేఫ్ అనే బేకరి నిర్వహిస్తున్న పునీత్ ఖురానా (40).. మంగళవారం రాత్రి తన నివాసంలో శవమైన తేలారు. కళ్యాణ్ విహార్‌ ప్రాంతం మోడల్ టౌన్‌లో నివాసం ఉంటోన్న (Puneet Khurana) పునీత్.. తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. భార్య మానికా వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవల నేపథ్యంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇంకా తను వ్యాపార భాగస్వామినే అంటూ తనకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని పునీత్ ను భార్య వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

భార్య మనికా, ఆమె పేరెంట్స్ కలిసి పునీత్‌ను మానసికంగా టార్చర్ చేశారని అతని సోదరి తెలిపింది. వీరికి 2016లో వివాహమైనట్టు తెలిపారు. కాగా, ఖురానా, మనికా మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ‘మనం విడాకులు తీసుకున్నాం.. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే.. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే’ అని పునీత్‌ను ఆమె డిమాండ్ చేయడం స్పష్టంగా వినిపిస్తోంది. అదేవిధంగా పునీత్‌ను భార్య తిడుతున్న ఓ సీసీ ఫూటేజీ వీడియో సైతం తాజాగా బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పునీత్ భార్యను విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసుల నోటీసులు జారీ చేశారు.

కాగా, భార్య వేధింపులు తాళలేక గత నెల ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతుల్ ఆత్మహత్య చేసుకొనే ముందు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసులో అతుల్ భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఢిల్లీలో పునీత్ ఖురానా అదే తరహాలో ఆత్మహత్య చేసుకోవడంతో మరోసారి భార్య వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పునీత్ ఖురానా భార్య మనికాను అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


Also Read...

Ap News: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య


👉 Read Disha Special stories


Next Story
null