- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Money saving: ఇలా చేస్తే నెలాఖరిలో ఉన్న ఈఎంఐ లు సులభంగా కట్టొచ్చు!
దిశ, వెబ్ డెస్క్ : మనం నెలంతా కష్ట పడినా కూడా.. నెలాఖరికి వచ్చేసరికి జేబులో రూపాయి ఉండటం లేదు. కొంత మంది ఎంత సంపాదించినా .. డబ్బును దాయలేరు. ఎందుకంటే, వారు ఆన్లైన్ లో షాపింగ్స్ చేస్తూ డబ్బును ఖర్చు చేస్తుంటారు. డబ్బును ఎలా అయిన సంపాదించుకోవచ్చు కానీ, ఇక్కడ పొదుపు చేయడం ముఖ్యం. అదే మనల్ని కాపాడుతుంది. అంతేకాదు, భవిష్యత్తు కోసం ముందుగా కొంత డబ్బును ఆదా చేసుకోవాలి. దాని కోసం కొన్ని అలవాట్లను పాటించడం వలన ఈజీగా మీ మంత్ ఎండ్ పేమెంట్స్ ను క్లియర్ చేసుకోవచ్చు. అయితే, ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
1. ఆన్‌లైన్ యాప్స్ వాడే అలవాటు ఉన్నవారు.. మానుకుంటే మంచిది. లేదంటే మీకు తెలియకుండానే చాలా ఖర్చు చేసే అవకాశం ఉంది.
2. ప్రతి నెల బడ్జెట్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి. దానికి మించిన ఖర్చులు అసలు పెట్టకూడదు. మీ ఆదాయాన్ని అనవసరమైన వాటి మీద మాత్రమే ఖర్చు చేయాలి.
3. మీ నెలవారీ జీతం పడినప్పుడు కనీసం 5000 చొప్పున ఆదా చేసినా.. ఏడాది చివరికీ చాలా డబ్బు సేవ్ అవుతుంది. డబ్బు ఆదా చేయాలంటే ఫుడ్ ఆర్డర్ యాప్‌ల వినియోగాన్ని తగ్గించుకోవాలి.
4. కొందరు మార్కెట్ కి వెళ్లి సరుకులు తీసుకురాకుండా .. ఇంట్లోనే ఉండి కావాల్సిన వాటిని ఆర్డర్ పెడుతుంటారు. దీని వలన ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా గ్రహించలేరు. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినందుకు అదనపు చార్జీలు పడతాయి. ఇలా నెలకు రూ. 5000 వృధాగా పోతాయి. ఇలా పెట్టె బదులు మీరు నేరుగా మార్కెట్ కి వెళ్తే ఆ ఐదు వేలు మిగులుతాయి. వాటిని నెలాఖరిలో ఉన్న ఈఎంఐ లు కట్టేందుకు ఉపయోగించవచ్చు.