ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)

by Kavitha |   ( Updated:2025-01-02 15:24:03.0  )
ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘క్షణం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత హిట్-1, హిట్-2, గూఢాచారి, మేజర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ప్రస్తుతం ఈయన ‘డెకాయిట్’ అనే మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘నమస్తే.. నేను మీ అడివి శేష్. ఏమౌతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్లు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ షేర్ చేసినా.. అదే నిజమని చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం.. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. సామాజిక మాద్యమాల్లో చెడును పోస్ట్ చేయొద్దు’ అంటూ అడివి శేష్ చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed