Tirumala Hundi : తిరుమ‌ల శ్రీ‌వారికి 2024లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-02 07:30:53.0  )
Tirumala Hundi : తిరుమ‌ల శ్రీ‌వారికి 2024లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
X

దిశ, వెబ్ డెస్క్ : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల(Tirumala) వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 2024 సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1365కోట్ల హుండీ ఆదాయం(Hundi Income) వ‌చ్చినట్లుగా టీటీడీ(TTD) వెల్లడించింది. భక్తుల సంఖ్యతో పాటు ప్రతియేట హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని.. 2024లో స్వామివారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని పేర్కొంది. 6.30 కోట్లమందికి అన్న ప్రసాదం అందజేశామని, 12.14 కోట్ల లడ్డూ విక్రయాలు జరిపినట్టు తెలిపింది.

కొత్తగా ఎస్వీ అన్న ప్రసాదం(Annprasadam) ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన‌ కియోస్క్(KIOSK) మిషన్ ను టీటీడీ ప్రారంభించింది. అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధ‌వారం ఈ మిషన్ ను ప్రారంభించారు. ఈ మిషన్ ను యూనియ‌న్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది. భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చని టీటీడీ తెలిపింది.


Also Read...


Tirumala : మరోసారి శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం

Advertisement

Next Story

Most Viewed