- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్తీ డైటింగ్ ట్రెండ్స్.. నిజంగానే మేలు చేస్తాయా?
దిశ, ఫీచర్స్ : ప్రజల్లో ఆరోగ్యంపట్ల శ్రద్ధ, అవగాహన రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త ఆహారపు అలవాట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ‘హెల్తీ డైట్స్’ పేరుతో అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయంటూ ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఫుడ్స్ లభిస్తు్న్నాయి. ఇక ఫలానా బ్రాండ్ పదార్థాలు లేదా డైట్స్ వాడితే ఆరోగ్యంగా ఉంటారనే ప్రకటనలకు కొదువేం లేదు. హెల్తీగా ఉండాలంటే తగినంత ప్రోటీన్ అవసరమని కొందరు, గ్లూటెన్-ఫ్రీ ప్రొడక్ట్స్ మేలు చేస్తాయని మరికొందరు అంటుంటారు. ఇలాంటి ప్రచారాల్లో నిజమెంత? వాస్తవానికి తరచూ ప్రచారంలో ఉండే కొన్ని ఆహార పోకడలు నిజానికి మంచిది కాదని ఆహార నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
ఫ్యాట్ ఫ్రీ ప్రొడక్ట్స్
మీరు అధిక బరవు పెరిగితే ఏం ఆలోచిస్తారు? త్వరగా తగ్గాలని భావిస్తారు. ప్రజల్లో ఇటువంటి ఆలోచనను కొన్ని వ్యాపార సంస్థలు తమ లాభాలకోసం వాడేసుకుంటున్నాయి. నిజానికి బరువు తగ్గడానికి కొవ్వులేని లేదా తక్కువ కొవ్వు కలిగిన ఆహారం కీలకం. కాబట్టి ఇటువంటి సమాచారంతో ఉండే ప్యాకేజింగ్ ఫుడ్స్ ప్రజలు మార్కెట్లో లేదా ప్రకటనల్లో చూసినప్పుడు అట్రాక్ట్ అవుతారు. కానీ నిజానికి ఫ్యాట్ ఫ్రీ ప్రొడక్ట్స్ మంచిది కాదు. కొవ్వు కూడా అవసరం మేరకు రోజువారీ డైట్‌లో (గింజలు, అవకాడో వంటివి) 20 నుంచి 35% వరకు ఉండాలి. లేకపోతే లో ఫ్యాట్ ప్రాబ్లమ్స్ అయిన అలసట, చర్మ సమస్యలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పైగా ఒక ఉత్పత్తిలో కొవ్వు కొరతను భర్తీ చేయడానికి, తయారీదారులు ఎక్స్‌ట్రా షుగర్, ఇతర ఆహారాలను మిక్స్ చేస్తుంటారు. కాబట్టి మార్కెట్ ఫుడ్స్ వాస్తవానికి మంచిది కాదు.
క్లీనింగ్ జ్యూస్
మీరు సీజన్ల వారీగా పొందలేని కొన్ని పండ్లకు సంబంధించిన జ్యూస్, ప్యాకేజింగ్ డ్రింక్స్ రూపంలో లభిస్తుంటాయి. ఉదాహరణకు మజా, యాపిల్ జ్యూస్ వంటివి మనం చూస్తుంటాం. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. మార్కెట్లో అదే ప్రచారం జరుగుతూ ఉంటుంది. కొంత వరకు జీర్ణ వ్యవస్థను డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి కావచ్చు. కానీ అదే పనిగా తీసుకుంటూ ఉంటే మాత్రం ప్రమాదమే. వాస్తవానికి జ్యూస్ క్లీన్‌లలో ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉండవు. పైగా ఈ డిటాక్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి, అధిక గ్యాస్ ప్రాబ్లం పెరగడానికి, కడుపులో ఉబ్బరం, అతిసారం, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
స్పోర్ట్స్ డ్రింక్స్
మీకు ఫుల్ ఎనర్జీ రావడానికి స్పోర్ట్స్ డ్రింగ్ బాగా ఉపయోపడతాయనే ప్రచారం ఫుల్లుగా ఉంది. అయితే అవి చాలా వరకు హెవీ వర్కవుట్ ప్లాన్‌ను కొనసాగించడంలో మాత్రమే సహాయపడతాయి. కానీ అందరూ తీసుకోడం లేదా స్పోర్ట్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తీసుకోవాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ షుగర్‌తో నిండి ఉండటమే కాకుండా, వాటి వినియోగం హార్ట్ రేట్, రక్తపోటుతో ముడిపడి ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
హై ప్రోటీన్స్
ఆరోగ్యానికి అధిక ప్రోటీన్ చాలా అవసరం అంటుంటారు. ఎందుకంటే ఎముక ఆరోగ్యానికి, కండరాల పెరుగుదలకు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను ఇది కలిగి ఉంటుంది. అయితే ఇది సహజంగానే తీసుకునే ఆహారాల ద్వారా పొందాలి. కానీ బయట లభించే అధిక ప్రోటీన్ ఆహార పదార్థాల్లో అధిక చక్కెరలు ఉంటాయి. ఇవి బరువు పెరగడం, డీ హైడ్రేషన్, మలబద్ధకం, బ్రెయిన ఫాగ్, కార్డియో వాస్క్యులర్ సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి మీరు రోజూ తీసుకునే ప్రొటీన్స్ సహజమైన ఆహారపు అలవాట్ల ద్వారా పొందాలి.
విటమిన్ సప్లిమెంట్స్
పోషకాల లోపంతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు విటమిన్లు, మినరల్స్ కలిగిన సప్లిమెంట్లను తీసుకోవడం మంచిదే. ముఖ్యంగా విటమిన్ B12 చాలా అవసరం. అయినప్పటికీ ఆహార పదార్థాలకు బదులుగా వీటిని వాడ కూడదు. అధికంగా విటమిన్ సప్లిమెంట్స్ వాడటంవల్ల శరీరంలో మార్పులు జరుగుతాయి. విషపూరితంగా మారవచ్చు. వాంతులు, విరేచనాలు, అస్పష్టమైన దృష్టి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
కేలరీ కటింగ్ ఫుడ్స్
మీరు వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించడమంటే సాధారణంగా కేలరీలను లెక్కించడం మొదలు పెడతారు. వాటిని తగ్గించాలని అనుకుంటారు. తక్కువ కేలరీలు కలిగిన పదార్థాలు రకరకాల పేరుతో మార్కెట్లో లభిస్తుంటాయి. కానీ తరచూ కేలరీలు లేని వాటిని తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. విపరీతమైన లేదా మరీ తక్కువగా కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం అనేది శరీరాన్ని ‘ఆకలి మోడ్’లోకి నెట్టవచ్చు. దీనివల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. పోషకాల లోపం, అతిగా తినడం, మానసిక కల్లోలం, ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలకు దారితీయవచ్చు.
చెమటలు పట్టని ఆవిరి దుస్తులు
మీరు ఎండలో వెళ్తుంటే లేదా జిమ్‌లో వర్కవుట్ చేస్తుంటే ‘సానా సూట్’ వంటి దుస్తులు ధరించాలని చెప్తుంటారు. అందరూ నమ్ముతుంటారు. కానీ వీటి తయారీలో ప్లాస్టిక్ వినియోగం ఉంటుంది. వాటిని ధరించడంవల్ల లాభాల కంటే నష్టమే ఎక్కువ. ఉదాహరణ సానా సూట్, మీకు విపరీతంగా చెమట పట్టేలా చేస్తుంది. ఈ ఆవిరి సూట్ కొవ్వును కాకుండా అధిక మొత్తంలో శరీర ద్రవాన్ని (fluid) చెమట రూపంలో బయటకు పంపేలా ప్రభావితం చేస్తాయి. దీంతో వీక్‌నెస్, డిజీనెస్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అన్ని సమయాల్లో హైడ్రేటెడ్‌గా ఉండాలని గుర్తుంచుకోండి.
కార్బ్-ఫ్రీ డైట్స్
కార్బ్-ఫ్రీ డైట్స్ బరువు తగ్గడానికి ఉత్తమ మార్గంగా నిరంతరం ప్రచారం చేయబడతాయి. లో- న్యూట్రియంట్ కార్బోహైడ్రేట్స్ కొంత వరకు మంచిదే కానీ. పిండి పదార్థాలు లేని ఆహారపు అలవాట్లు తరచుగా కొనసాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా పిండి పదార్థాలు పూర్తిగా తినవద్దని ఆరోగ్య నిపుణులు కూడా సిఫార్సు చేయరు. తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలతో వీటిని కూడా సులభంగా పొందవచ్చు. ఇవి మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతాయి. మెదడు, శరీర పనితీరును ఆప్టిమైజ్ చేస్తాయి. చిలగడదుంపలు, బెర్రీలు, బీన్స్, వోట్మీల్ వంటి సంక్లిష్ట పిండి పదార్ధాలను ఎంచుకోండి.
పచ్చి కూరగాయలు తినడం
కొన్ని ఆహార పదార్థాలు పచ్చివిగా తినడం మంచిదని చెప్తుంటారు. తాజా పండ్లు, పండ్లు, కూరగాయలు కూడా ఇందులో భాగమే. ఇవి తినడంవల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ చాలా వరకు పచ్చివిగా ఉన్నప్పుడు తినడం మాత్రం మంచిది కాదు. క్యారెట్‌లో బీటా కెరోటిన్ వంటి కొన్ని పోషకాలు ఉంటాయి. పచ్చిగా తినడం వల్ల ఏమీ కాదు. పైగా మంచిదే. కానీ ఉడికించినప్పుడు అందులోని కెరోటిన్‌ను శరీరం మరింత సులభంగా గ్రహిస్తుంది.
డిటాక్స్ టీ
ఫలానా టీ తాగితే మీరు స్లిమ్‌గా తయారవుతారు. శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి అనే ప్రచారాల్లో చాలా వరకు నిజం లేదు. జీర్ణవ్యవస్థతో సహా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని నమ్మడంవల్ల చాలామంది అనుసరిస్తుంటారు. కానీ వాస్తవంలో డిటాక్స్ టీలు సాధారణమైనవే తప్ప ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ కలిగించవు. పైగా చాలా ఖరీదైనవి, కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.