Kidney Health: ఈ అలవాట్లు డేంజర్.. మానుకోకపోతే కిడ్నీలు పాడవుతాయ్!

by Javid Pasha |
Kidney Health: ఈ అలవాట్లు డేంజర్.. మానుకోకపోతే కిడ్నీలు పాడవుతాయ్!
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండటంలో రోజువారీ అలవాట్లు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అవి శారీరక విధులను, అవయవాల పనితీరును నియంత్రిస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల హాబిట్స్ కిడ్నీ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉటుందని, వాటిని మానుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం.

యూరిన్‌ను‌ కంట్రోల్ చేసుకోవడం

పలువురు బిజీగా ఉండటం వల్లనో, బయట ఉన్నప్పుడు టాయిలెట్స్ అందుబాటులో లేకనో బ్లాడర్ ఫుల్ అయినప్పటికీ మూత్ర విసర్జనకు వెళ్లకుండా ఆలస్యం చేస్తుంటారు. తర్వాత చేద్దాం లే అనుకొని కంట్రోల్ చేసుకుంటారు. కానీ ఇది కిడ్నీల ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందని, తరచూ ఇలా మూత్రాన్ని బిగపట్టుకునే అలవాటు కిడ్నీల ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి అలవాటును వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.

నీళ్లు తక్కుగా తాగడం

కొందరు ఏం అవుతుందిలే అనుకొని నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కానీ ఈ అలవాటు ప్రమాదకరం. శరీరానికి సరిపడా నీరు తాగకపోతే హైడ్రేటెడ్‌గా ఉండలేరు. అలాగే కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. బాడీలో నీటికొరత ఏర్పడితే శరీరంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు విఫలం అవుతాయి. దీంతో కిడ్నీ స్టోన్స్, ఇతర సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే రోజుకు ఏడెనిమిది గ్లాసుల వరకు నీరు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

జంక్ ఫుడ్స్ తీసుకోవడం

జంక్ ఫుడ్స్ తరచుగా తీసుకునే అలవాటు క్రమంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను దూరం చేస్తుంది. ముఖ్యంగా బేకన్, సాసేజ్, హాట్ డాగ్లు, రెడ్ మీట్, పిజ్జా, బర్గర్, అదర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునే వారు హెల్తీ ఫుడ్‌పై ఆసక్తి చూపరు. వీరు తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఫుడ్ ఆహారంలో భాగంగా తీసుకోవడాన్ని దీర్ఘకాలంపాటు తగ్గించడంవల్ల కిడ్నీలు పాడయ్యే చాన్సెస్ ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అందుకే వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed