Health tips : ఆ సమస్య ఉన్నవాళ్లు టమాటాలు తినకూడదా?.. ఏం జరుగుతుంది?

by Javid Pasha |
Health tips : ఆ సమస్య ఉన్నవాళ్లు టమాటాలు తినకూడదా?.. ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో ఏ కూర వండినా అందులో వేయడానికి టమాటాలను తప్పకుండా వాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అవి లేకుండా కూరలు రుచిగా ఉండవని చెప్తుంటారు. మంచి గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి అందరూ వాడేందుకే ఇష్టపడతారు. పైగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు టమాటాల్లో ఫుల్లుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం వాటిని తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.

కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు

ఇటీవల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్‌తో చాలామంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు టమాటాలను నేరుగా కానీ, వంటకాల్లో వాడటం ద్వారా కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉండటంవల్ల స్టోన్స్ పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తుంది.

కీళ్ల నొప్పులు, వాపు

కీళ్ల నొప్పులు, శరీరంలో వాపు సమస్యతో బాధపడేవారు కూడా టమాటాలను అవైడ్ చేయాలి. ఎందుకంటే ఇవి సమస్యను మరింత పెంచుతాయి. టమాటాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నప్పటికీ అందులోని ఇతర పోషకాలు, ఆమ్ల గుణాలు నొప్పి నివారణకు ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

డయేరియా, గ్యాస్ ప్రాబ్లమ్స్

వాంతులు, విరేచనలు, ముఖ్యంగా డయేరియాతో బాధపడుతున్నవారు టమాటాలను తినకూడదు. వీటిలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా విరేచనాలను మరింత ప్రేరేపిస్తుంది. అలాగే విటమిన్ సి అధికంగా ఉండటం, ఆమ్ల గుణాలు కలిగి ఉండటం మూలంగా అప్పటికీ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యతో బాధపడేవారు టమాటాలను తినకూడదు. అలాగే స్కిన్ అలెర్జీలు, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా టమాటాలు తినకూడదని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed