- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పువ్వుతో ఆర్థిక సమస్యలు దూరమవడమే కాదు అనేక వ్యాధులకు కూడా దివ్యౌషధం..
దిశ, వెబ్ డెస్క్ : మందారంలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆయుర్వేదంలో మందార మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ మొక్క పొడవు 3 నుంచి 8 అడుగులు, వెడల్పు 2 నుంచి 7 అడుగుల వరకు ఉంటుంది. మందార పువ్వులు చాలా అందంగా ఉండి, అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఈ మందార పువ్వు సంపదలు కురిపించే దేవత లక్ష్మిదేవికి అత్యంత ప్రియమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ పుష్పాన్ని పెట్టి లక్ష్మీ దేవిని పూజిస్తే సిరసంపదలు ఆ ఇంట్లో ఉండేలా దీవిస్తుందట. అంతే కాదు భక్తుల కోరికలు కూడా కచ్చితంగా నెరవేరతాయంటున్నారు పండితులు.
వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ధార్మిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయని చెబుతున్నారు. మందార మొక్కను ఇంటికి ఉత్తర దిశలో నాటడం శుభప్రదమని చెబుతున్నారు.
మందారలో ఉండే ఔషధ గుణాలు..
మందార పువ్వు బరువును అదుపులో ఉంచుతుంది. అంతే కాదు మందార ఆకులను నమలడం వల్ల నోటిపూత నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే మందార ఆకులను తింటే కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో మందార పువ్వులు చాలా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే మందారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మందార జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుందంటున్నారు. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తొలగించడానికి దీనిని ఉపయోగించవచ్చు.
మందారను ఎలా ఉపయోగించాలి..
మందార పువ్వులతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని అన్నారు. మందారం ఆకులు లేదా పువ్వులను పొడి రూపంలో ఉపయోగిస్తారు. మందార ఆకులను టీ, రసం లేదా ఆకుల రూపంలో తీసుకోవచ్చు. దాని టీ చేయడానికి, మందార ఆకుల పొడి, లేదా పువ్వులు తీసుకోండి. ఒక కప్పు నీటిని మరిగించి అందులో మందారం ఆకుల పొడి లేదా పువ్వుల పొడిని వేయాలి. 5-10 నిమిషాల తర్వాత ఫిల్టర్ చేసి తాగాలి. మందార టీని చేయడానికి తాజా మందార పువ్వులను నీటిలో ఉడకబెట్టండి. తర్వాత దీన్ని చల్లార్చి వడపోసి తేనె కలుపుకుని తాగాలి. మందారాన్ని పేస్ట్ రూపంలో కూడా ఉపయోగిస్తారు. తాజా మందార పువ్వులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి చర్మానికి రాసుకుంటే మొటిమలు, మచ్చల నుండి ఉపశమనం పొందవచ్చు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.