- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్యాకేజింగ్ ఆహారాల్లో కెమికల్స్.. కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే చాన్స్ !
దిశ, ఫీచర్స్ : మనం తరచూ వాడే ప్యాకేజింగ్ ఆహారాలవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది, ముఖ్యంగా వాటిలో యూజ్ చేసే కెమికల్ ఎక్స్‌పోజర్స్ వల్ల బాలికల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నిపుణులు చెప్తున్నారు. ఆహార పదార్థాలు పాడవకుండా వినియోగించే ఈ రసాయనాలను ఫ్లోరినేటెడ్ కెమికల్స్ లేదా ఫరెవర్ కెమికల్స్‌గా పేర్కొంటున్నారు.
తరచుగా ఫ్లోరినేటెడ్ కెమికల్స్‌కు గురైన బాలికల్లో ఎదుగుదల లోపాలు, మహిళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్టడీలో భాగంగా రీసెర్చర్స్ మొత్తం 824 మంది బాలికలు, మహిళలకు సంబంధించిన హెల్త్ రిపోర్టులను ఎనలైజ్ చేశారు. వీరిలో హెయిర్ అండ్ బ్రెస్ట్ డెవలప్‌మెంట్ సహా అన్ని యవ్వనదశ లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఓవరాల్‌గా 24 శాతం మంది బాలికల్లో కెమికల్స్‌కు బహిర్గతం కావడంవల్ల తర్వాతి దశలో రుతుక్రమ సమస్యలు ఏర్పడ్డాయని, 42 శాతం మంది మహిళల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగాయని గుర్తించారు.