బొప్పాయి ఆకులతో ఆరోగ్యం

by Sujitha Rachapalli |
బొప్పాయి ఆకులతో ఆరోగ్యం
X

దిశ, ఫీచర్స్: బొప్పాయి ఆకులకు సంప్రదాయ వైద్యంలో కీలక చోటు ఉంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం విరివిగా వినియోగించబడుతున్నాయి. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

* ఇమ్యూనిటి బూస్టర్

పాపాయా ఆకుల్లో విటమిన్ ఏ, సి, ఇ అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా ప్రొటెక్ట్ చేస్తుంది.

* జీర్ణక్రియకు హెల్ప్

బొప్పాయి ఆకుల్లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్స్ ను బ్రేక్ చేసి డైజెస్టివ్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.

* డెంగ్యూలో సాయం

ఇప్పటి వరకు చేసిన అధ్యయనాలు.. బొప్పాయి ఆకు రసం ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతుందని గుర్తించాయి. డెంగ్యూ లక్షణాలను తగ్గిస్తుందని నిర్ధారించాయి.

* షుగర్ లెవెల్స్ తగ్గింపు

బొప్పాయి ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతాయి. డయాబెటిక్ పేషెంట్లకు భారీ బెనిఫిట్స్ అందిస్తుంది.

* లివర్ హెల్త్

పాపాయ లీవ్స్ డిటాక్సిఫైయింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. లివర్ ఫంక్షన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

* స్కిన్ హెల్త్

బొప్పాయి ఆకులోని యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు, ముడతలు, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. స్పష్టమైన, ఆరోగ్యకరమైన ఛాయను అందిస్తాయి.

* క్యాన్సర్ తో పోరాటం

తాజా అధ్యయనాల ప్రకారం.. ఈ పండు ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతాయి.

* జుట్టు పెరుగుదల

పాపాయ అకుల్లోని న్యూట్రియంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. స్కాల్ప్ ఆరోగ్యానికి హెల్ప్ అవుతాయి. డ్యాండ్రఫ్ ను తగ్గించి.. జుట్టు ఊడటాన్ని నిలిపేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed