- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్భుతం : అండం, వీర్యం లేకుండానే బిడ్డకు జన్మ..ఎలా అంటే?
దిశ, ఫీచర్స్ : అమ్మ అవడం దేవుడిచ్చిన గొప్ప వరం.నలుసుగా కడుపులో పడినప్పటి నుంచి తొమ్మిది నెలలు నిండి తన బిడ్డ భూలోకంలోకి వచ్చే వరకు, ఆ తల్లి పొందే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. తెలియకుండా తల్లికి, బిడ్డకు మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. తన తల్లి ప్రతి కష్టాన్ని, ఇష్టాన్ని ఆ బిడ్డ కడుపులో ఉండే తెలుసుకుంటుంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి అనుభూతులు కరువయ్యే అవకాశం ఉందని అంటున్నారు పరిశోధకులు. తల్లి కడుపులో బిడ్డను పెంచడం ఇష్టం లేదు అనుకునే వారికి భవిష్యత్తులో యంత్రాల ద్వారా కూడా బిడ్డను కనగలిగే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది.
ఈ టెక్నాలజీ ద్వారా అండం, వీర్యం, గర్భాశయం లేకుండానే బిడ్డకు జన్మనివ్వవచ్చునంట. దీనిని ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీ అంటారు. ఇది ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండంలా పని చేస్తుందని యాక్టోలైఫ్ పేర్కొంది. మానవ కణాలు, మానవ మూలకణాలను, ప్రయోగశాలలో వృద్ధి చేసిన కణాలను తీసుకొని..మానవ పిండాన్ని రూపొందిస్తారు. తర్వాత ఆ పిండాన్ని, తొమ్మిది నెలలు నిండి, బిడ్డ మానవ రూపు ధరించి బయటకు వచ్చే వరకు కృత్రిమ గర్భంలోనే ఉంచుతారు. తొమ్మిది నెలలు ఆ బిడ్డ సంరక్షణను ఆ యంత్రమే చూసుకుంటుంది. ఆ తర్వాత ఎవరైతే బిడ్డను కనాలనుకున్నారో వారికి ఇస్తారు.