బాయ్ ఫ్రెండ్‌లో ఈ బిహేవియర్ గమనించారా?.. మీ మీద ఇంట్రెస్ట్ పోయినట్టే!

by Javid Pasha |
బాయ్ ఫ్రెండ్‌లో ఈ బిహేవియర్ గమనించారా?.. మీ మీద ఇంట్రెస్ట్ పోయినట్టే!
X

దిశ, ఫీచర్స్ : స్త్రీ, పురుషుల మధ్య రిలేషన్‌షిప్ ట్రెండ్స్ రోజు రోజుకూ మారుతున్నాయి. ఒకప్పుడు బంధం ముడిపడినా, ప్రేమ చిగురించినా ఇద్దరు వ్యక్తుల మధ్య అండర్ స్టాండింగ్ అప్పటి సామాజిక పోకడలను బట్టి ఉండేది. భర్త లేదా బాయ్ ఫ్రెండ్ ప్రవర్తన నచ్చినా, నచ్చకపోయినా అమ్మాయిలు దాదాపు సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడా పరిస్థతి లేదు. మంచిగా ఉన్నంతసేపే లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ బాగుంటున్నాయి. బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ బిహేవియర్ ఏమాత్రం నచ్చకపోయినా బ్రేకప్‌లు, డివోర్స్ కామన్ అయిపోయాయి.

వాస్తవానికి రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం కీలకపాత్ర పోషిస్తాయి. కానీ కొందరిలో ఇందుకు భిన్నంగా జరుగుతూ ఉంటుంది. రొమాంటిక్ రిలేషన్‌లోకి అడుగు పెట్టిన కొద్దిరోజులకే మోజు తీరిపోతుంది. పార్ట్‌నర్‌పై ఆసక్తి తగ్గుతుంది. అయితే ఎదుటి వ్యక్తి ప్రవర్తనను బట్టి కూడా వారికి మీపై ప్రేమ, ఇంట్రెస్ట్ ఎలా మారుతున్నాయో అంచనా వేయవచ్చు. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిన బాయ్ ఫ్రెండ్ బిహేవియర్‌కు సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మాటల్లో, ప్రవర్తనలో మార్పు

ఇంతకాలం ఎంతో క్లోజ్‌గా.. ఫ్రెండ్లీగా ఉంటూ.. మీకు నచ్చినట్లు వ్యవహరించే బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు రూడ్‌గా ప్రవర్తిస్తున్నాడంటే అనుమానించాల్సిందే. దీంతోపాటు ప్రతి దానికీ అసభ్యంగా తిట్టడం, సూటిపోటి మాటలతో వేధించడం వంటి ప్రవర్తన గమనిస్తే అతనికి మీపట్ల ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆసక్తిలేని వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ అతనితో మాట్లాడేందుకు, కలిసేందుకు ఉత్సాహం చూపినా, అతను మాత్రం చిరాకు, కోపం ప్రదర్శిస్తుంటాడు. లవర్‌ను దూరం చేసుకునే ఉద్దేశంతో కావాలనే ఇలా బిహేవ్ చేస్తుంటాడు. దీనిని బట్టి అతనికి ఆసక్తిలేదని అర్థం చేసుకోవచ్చు.

టైమ్ స్పెండ్ చేయకపోవడం..

గర్ల్ ఫ్రెండ్‌పై ఇంట్రెస్ట్ కోల్పోయిన అబ్బాయి తన రిలేషన్‌షిప్ గురించి పెద్దగా పట్టించుకోడు. అవతలి వ్యక్తి ఆసక్తి చూపినా, వివిధ విషయాల్లో చొరవ చూపినా డిస్కషన్ చేయడానికి ఇష్టపడడు. గర్ల్‌ఫ్రెండ్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపక పోగా అవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏదో ఒక కారణం చెప్తూ ఆమెకు ఆసక్తి విషయాలను వాయిదా వేయడం, తప్పించుకోవడం, పదే పదే అడిగితే కోప్పడటం చేస్తుంటాడు.

రొమాన్స్‌కు దూరంగా..

మొదట్లో లవర్‌ను వదిలిపెట్టి క్షణమైనా ఉండలేనన్నట్టుగా వ్యవహరించిన వ్యక్తి, ఏమాత్రం అవకాశం దొరికినా రొమాన్స్‌పట్ల మక్కువ చూపిన వ్యక్తి, తన గర్ల్ ఫ్రెండ్‌పట్ల ఆసక్తికోల్పోతే నెలకోసారి కూడా ఆ విషయంలో శ్రద్ధ చూపకపోవచ్చు. ఆమె ఇంట్రెస్ట్ చూపినా ఇతను మాత్రం దూరంగా ఉంటాడు. కిస్సింగ్, హగ్గింగ్ వంటి చిన్న చిన్న చిలిపి పనులను కూడా తప్పుపట్టడం, దూరంగా ఉంచడం, మరేం పనిలేదన్నట్టు ఇదేంటని కసురుకోవడం వంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. దీనిని బట్టి అతను మీకు దూరమైపోతున్నాడని అర్థం.

రెస్పాన్స్‌బిలిటీ ఉండదు

రిలేషన్‌షిప్ అంటే లవ్ అండ్ రొమాన్స్ మాత్రమే కాదు, ఇక్కడ పరస్పర గౌరవం, రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ముఖ్యం. బాధ్యతాయుతమైన సంబంధం అని భావించినప్పుడు అబ్బాయి ఎంత బిజీగా ఉన్నా, ఎంత సమయం లేకపోయినా ఏదో ఒక సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆసక్తికోల్పోయిన వ్యక్తి ఇవేవీ చేయడు. గర్ల్ ఫ్రెండ్ పర్సనల్ ఇష్యూస్‌ను, బాధలను, భావోద్వేగాలను ఆమెకే వదిలేస్తుంటాడు. ఈ ప్రవర్తన కనిపిస్తే మీరు అనుమానించాల్సిందే.

కాల్స్, మెసేజెస్‌కు నో రిప్లయ్

మీరు పదిసార్లు మెసేజ్ పెట్టినా ఒక్కసారి కూడా రిప్లయ్ ఇవ్వడు, కాల్స్ విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడో ఒకసారి రిసీవ్ చేసుకొని కసురుగా మాట్లాడుతుంటాడు. ఇలాంటి ప్రవర్తన మీ బాయ్ ఫ్రెండ్‌లో గమనిస్తే.. అతను మీపట్ల ఆసక్తిలేకుండా ఉన్నాడని అనుమానించవచ్చు. అలాగే ఇద్దరికీ సంబంధించి ఉమ్మడి నిర్ణయాలకు ప్రయారిటీ ఇవ్వకపోవడం, మీ లక్ష్యాలు, ఆసక్తులను హేళన చేయడం, మాట వరుసకైనా సపోర్ట్ చేయకపోవడం వంటివి కూడా ఇంట్రెస్ట్ లేని బిహేవియర్‌లో భాగమే.

ఫ్యూచర్ గురించిన ఆలోచన ఉండదు

తన గర్ల్ ఫ్రెండ్ లేదా భాగస్వామిపట్ల ఇంట్రెస్ట్ కోల్పోయిన వ్యక్తి తాము కలిసి జీవించే విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటం మానేస్తాడు. ప్రేమ, బంధం, పెళ్లి వంటి అంశాలు చర్చకు రాకుండా అవైడ్ చేస్తుంటాడు. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రియురాలిని తన జీవితం నుంచి దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తుంటాడు. మాటల్లో, ప్రవర్తనలో నిజాయితీ, బాధ్యత ఉండవు. ఈ సంకేతాలు మీ బాయ్ ఫ్రెండ్‌లో కనిపిస్తే గనుక అలర్ట్ అవ్వాలని, అన్ని విషయాలను ఓపెన్‌గా మాట్లాడుకొని బంధాన్ని బలోపేతం చేసుకోవాలని రిలేషన్‌షిప్ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story