- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టయిలిష్ హెయిర్.. అందమైన జుట్టుకోసం జ్యూస్ !
దిశ, ఫీచర్స్: అందమైన ఆహార్యమే కాదు, అందుకు తగిన జుట్టు కూడా ఎంతో ముఖ్యం. అందుకే జుట్టును జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు అమ్మాయిలు. కొందరు పొడువాటి జడను ఇష్ట పడితే.. కొందరు రకరకాల డిజైన్ల హెయిర్ స్టయిల్‌ను ఇష్ట పడుతుంటారు. అయితే జుట్టును ఎలా కావాలంటే అలా స్టయిలిష్‌గా మల్చుకోవాలంటే ముందు దానిని కాపాడుకోవాలి. వెంట్రుకలు రాలిపోవడం, లేదా తలలో చుండ్రు సమస్య వంటివి నివారించుకోవాలి అంటున్నారు బ్యుటీషియన్లు. అందుకు అవసరమైన పోషకాలు అవసరం అంటున్నారు డైటీషియన్లు. కొందరిని చుండ్రు సమస్య తరచూ వేధిస్తుంటుంది. చలికాలంలో ఇది కాస్త ఎక్కువే. ఈ సీజన్‌లో జుట్టుకు సంబంధించిన సమస్యలు చికాకు పెడుతుంటాయి. స్కాల్ప్ పొడిబారి సమస్య అధికం అవుతుంది.
ఇటువంటి సమస్యలను నివారించుకోగలిగితే.. అందమైన జుట్టు నిగారింపు సొంతమవుతుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడంవల్ల మహిళలు పొడవాటి, లేదా కాంతివంతమైన జుట్టును పొందవచ్చునట. పెద్దలు తరతరాలుగా ఫాలో అవుతున్న ఓ చిట్కా, జుట్టును అందాన్ని నిగారింపజేస్తుందని చెప్తున్నారు. సహజమైన పదార్థాలతో ఇంట్లోనే తయారు చేసుకునే జ్యూస్ తాగడంవల్ల జుట్టు అలలు అలలుగా నిగారించేలా.. అందంగా మారుతుందట. ఈ మధ్య చాలా మంది జుట్టుకు బయట లభించే కెమికల్ ఉత్పత్తులు వాడుతున్నారు. అయితే దీనివల్ల నష్టం జరుగుతుందని నిపుణులు నిపుణలు చెప్తున్నారు. జుట్టును కాపాడుకునేందుకు సహజమైన హెయిర్ కేర్ పద్ధతులు పాటించడం బెటర్ అంటున్నారు బ్యటీషియన్లు. జుట్టు అందంకోసం ఆయుర్వేదిక్ నిపుణులు, డైటీషియన్లు ఇంట్లోనే తయారు చేసుకునే జ్యూస్‌ను సజెష్ చేస్తున్నారు. అదేమిటో తెలుసుకుందాం.
ఇది పాటిస్తే సరి..
జుట్టు నిగారింపుకోసం బీట్‌రూట్, ఉసిరి, అల్లం, కరివేపాకు, నీరు కలిపి తయారు చేసే జ్యూస్ లేదా ద్రవ పదార్థం తాగడంవల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఉసిరి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టును మెరిసేలా చేస్తుంది. అల్లం జుట్టు పొడవు కావడానికి, జుట్టు రాలకుండా ఉండటానికి ఉపకరిస్తుంది. బీట్‌రూట్‌లో కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వీటన్నింటితో తయారు చేసే సహజ సిద్ధమైన జ్యూస్ జుట్టును తళ తళ మెరిసేలా చేస్తుంది. జుట్టు పెరిగే సాధారణ వేగంతో పోలిస్తే ఈ చిట్కాతో ఐదు రెట్లు ఎక్కువగా జుట్టు పెరుగుతుంది.
తయారీ విధానం
జుట్టు నిగారింపుకోసం పైన చెప్పిన జ్యూస్ తయారు చేసుకోవడానికి.. ఒక బీట్‌రూట్, 10 నుంచి 12 కరివేపాకులు, ఒక ఉసిరికాయ, ఒక టేబుల్ స్పూన్ అల్లం, అరకప్పు నీళ్లు తీసుకోవాలి. ముందు బీట్‌రూట్, కరివేపాకు, ఉసిరికాయ, అల్లంలను శుభ్రంగా కడగాలి. తర్వాత మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. అవసరాన్ని బట్టి నీటిని యాడ్ చేయాలి. తర్వాత ఒక గిన్నె పైన మస్లిన్ గుడ్డను వేసి, ఆ మిశ్రమాన్ని వడగట్టాలి. ఫిల్టర్ అయిన ఆ జ్యూస్ తాగడానికి రెడీ అయినట్లే. దీన్ని నేరుగా తాగొచ్చు. జుట్టు పెరుగుదలను మరింత ప్రోత్సహించడానికి జుట్టు కుదుళ్లకు కూడా దీన్ని అప్లై చేయవచ్చు.
READ MORE
'భయ్యా.. ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి' అని అడగొద్దంటూ జొమాటో ట్వీట్