- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇష్టం ఉన్నా అమ్మాయిలు ప్రపోజ్ చేయలేరు..! కారణం ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్: ఆధునిక యుగంలో అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా అన్నీ రంగాల్లో ముందున్నారు. కానీ, ప్రేమను వ్యక్తపరచడంలో మాత్రం వెనకబడి ఉన్నారు. ప్రేమను చెప్పే విషయంలో అమ్మాయిలు వెనకడు వేస్తారు. అబ్బాయిలే ముందుగా ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. కానీ, ఎవరో ఒకరు ఇందుకు భిన్నంగా ఉంటారు.
ఆత్మగౌరవం: అబ్బాయి అంటే ఇష్టం ఉన్నా.. అమ్మాయి ముందుగా ప్రపోజ్ చేయదు. ఎందుకంటే, అమ్మాయిలే ముందుగా ప్రపోజ్ చేస్తే, అది వాళ్ల ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్లుగా భావిస్తారు. అలా చేస్తే అబ్బాయి తనను గౌరవించడని అనుకుంటారు. ప్రేమలో గొడవలు అనేవి సహజం. అటువంటి సందర్భంలో తనను అగౌరవపరిచి మాట్లాడతాడని, ప్రతిసారీ బెదిస్తాడనే ఆలోచనతో ఉంటారు. మరికొందరు అమ్మాయిలు.. రిలేషన్‌ని మధ్యలోనే వదిలేస్తారని అనుకుంటారు. ఇవన్నీ ఆలోచిస్తూనే అమ్మాయిలు ప్రపోజ్ చేసే ధైర్యం చేయరు.
రిజెక్ట్ చేయవచ్చు: తాను ముందుగా ప్రేమ విషయం చెబితే ఒక్కొసారి అబ్బాయి రిజెక్ట్ చేయవచ్చు. అలా రిజెక్ట్ చేయడాన్ని అమ్మాయిలు తట్టుకోలేరు. అబ్బాయి కాదనడం అమ్మాయిని ఎక్కువగా బాధపెడుతుంది. అది వారి మానసిక ప్రశాంతతను పోగొడుతుంది. అందుకే అబ్బాయిపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ అమ్మాయిలు ప్రపోజ్ చేయరు.
బోల్డ్ అంటారని: తమకు నచ్చిన అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి అమ్మాయి వెనుకాడుతుందంటే తనపై సమాజం బోల్డ్ అనే ముద్ర వేస్తుందని భయపడుతుంటారు. అలా అనిపించుకోవడం ఇష్టంలేక అమ్మాయిలు ప్రేమను దాచుకుంటారు. అందుకే ఆమె తన ప్రేమను అబ్బాయితో చెప్పడానికి ఆలోచిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా తాను ఇష్టపడుతున్న అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, అమ్మాయిలు ప్రిన్సెస్‌లా ఫీలవుతుంటారు. ఈ ఫీలింగ్ వాళ్లలో సంతోషాన్ని కలిగిస్తుంది.