పొదుపు విషయంలో తగ్గేదే లేదు..Z Gen సేవింగ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula Samataha |
పొదుపు విషయంలో తగ్గేదే లేదు..Z Gen సేవింగ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : పొదుపు చేయడం అనేది చాలా అవసరం. పెద్దవారు ఈ జనరేషన్ వారికి ఎక్కువగా చెబుతుంటారు, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. మీరు సంపాదించే దాంట్లో కొంతైనా దాచుకోవాలని. కానీ ఈ Z Gen వారు అలా ఉండరూ అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ తాజా నివేదికలు చూసి నిపుణులు సైతం షాక్ అవుతున్నారు. Z Gen వారు తమ ఖర్చులు, ఆదాయాల విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తున్నారంట. మిలియనీర్స్ కూడా ఊహించని విధంగా వీరు పొదుపు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి Z Gen వారు అనగానే ఫ్యాషన్, ఎంజాయ్ మెంట్ ఎక్కువ చేస్తారు. అనవసరమైన ఖర్చులు, నచ్చిన డ్రెసెస్, ఫ్రెండ్స్‌తో పార్టీస్ ఇలా వారికి నచ్చినట్టుగా ఉంటూ డబ్బు ఖర్చు చేయడమే తప్ప పొదుపు చేయరు అనుకుంటారు. కానీ వారు కూడా సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారంట.

క్లియో అనే ఏఐ ఫైనాన్స్ యాప్ 16 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసుగల Gen Zలను డబ్బు పట్ల వారి వైఖరి గురించి సర్వే చేసింది. కాగా, ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. Gen Z వారిలో 70శాతం మంది రెగ్యూలర్‌గా తమ సంపాదనలో నుంచి కొంత నగదును సేవింగ్ చేస్తున్నారంట.రోజూవారి ఖర్చులలో కాంప్రమైజ్ కాకుండా ఆదాయం చేస్తున్నట్లు తేలింది. తమ ఆదాయం నుంచి 40 శాతం సేవింగ్ చేస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. అయితే కొంత మంది తమ హాస్టల్ ఫీజు, కాలేజీ ఫీజుల కోసం ఆదా చేస్తే మరికొంతమంది వేరే దేశాలకు వెళ్లడానికి, ఇల్లు లేదా వారికి నచ్చిన టూ వీలర్, ఫోర్ వీలర్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి డబ్బు ఆదా చేస్తున్నట్టు తేలింది.ఇక ఈ జనరేషన్ వారు ఎంజాయ్ చేస్తూ కూడా 40 శాతం డబ్బును ఆదాచేయడం మిలియనిల్స్‌నే కాకుండా పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement

Next Story