Hemoglobin deficiency : హిమోగ్లోబిన్ లోపంతో ఇబ్బందులా..? ఈ ఆహారాలతో ప్రాబ్లం క్లియర్ !

by Javid Pasha |
Hemoglobin deficiency : హిమోగ్లోబిన్ లోపంతో ఇబ్బందులా..? ఈ ఆహారాలతో ప్రాబ్లం క్లియర్ !
X

దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినంత రక్తం ఉండాలి. ఇది ప్రొడ్యూస్ కావడంలో ఎర్ర రక్త కణాలు, అందులోని హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కావాలంటే హిమోగ్లోబిన్ చాలా ముఖ్యం. సాధారణంగా పురుషులకు 14 నుంచి 18 గ్రాములు, మహిళలకైతే 12 నుంచి 16 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ లెవల్స్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు శారీరక బలహీనత, రక్తహీనత, అలసట, తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారం రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చునని సూచిస్తున్నారు. ఆ ఆహారాలు ఏమిటో చూద్దాం.

రక్తహీనత లేదా హిమోగ్లోబిన్ లోపానికి ప్రధాన కారణం ఐరన్ లోపమేనని నేషనల్ అనీమియా(Anemia) యాక్షన్ కౌన్సిల్ నివేదిక పేర్కొంటున్నది. అయితే రోజువారీ ఆహారాల ద్వారా దీనిని భర్తీ చేయవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పాలకూర, బీట్‌రూట్, బాదం, ఎండు ద్రాక్ష, పుచ్చకాయ, గుమ్మడి గింజలు, దానిమ్మ, యాపిల్స్, ఖర్జూరం వంటివి రెగ్యులర్‌గా తీసుకోవడంవల్ల హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో ఐరన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. వీటితోపాటు విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, స్ట్రాబెర్రి, నారింజ, బొప్పాయి, ద్రాక్ష, టమోటాలు, బ్రోకలీ, వేరు శెనగలు, అరటిపండ్లు, పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటివి కూడా డైట్‌లో భాగంగా తీసుకుంటూ ఉంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed