Pregnancy Tips: పిల్లలు తెలివిగా పుట్టాలా.. ప్రముఖ గైనకాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే?

by Anjali |
Pregnancy Tips: పిల్లలు తెలివిగా పుట్టాలా.. ప్రముఖ గైనకాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, ఫీచర్స్: ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ కాగానే తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కళలు కంటారు. పిల్లల పోలికలు, ఆలోచనలు.. పేరెంట్స్‌వి వస్తాయో, నానమ్మ, తాయయ్యలవి వస్తాయోనంటూ సరదాగా గుర్తు చేసుకుంటుంటారు. అయితే ప్రతి బిడ్డ యొక్క తల్లిదండ్రులు పిల్లలు తెలివైనవారిగా పుట్టాలని కోరుకుంటారు. కాగా బేబీ కడుపులో ఉన్నప్పుడే ఇంటలిజెంట్‌గా మారాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే.. మీ బిడ్డ తప్పకుండా తెలివిగా పుడుతుందంటున్నారు పలువురు అగ్ర గైనకాలజీ వైద్య నిపుణులు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

నాణ్యమైన ఆహారం తీసుకోవడం..

బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. రెండు ప్రాణాలకు ఆరోగ్యమైన ఫుడ్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని గుర్తించుకోవాలి. బేబీ ఎదుగుదలకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎంతో అవసరం. కాగా ఫిష్, సోయాబీన్స్, ఐరన్ పుష్కలంగా ఉండే ఆకు కూరలు, బాదం, వాల్ నట్స్ అధికంగా తీసుకుంటే బిడ్డ తెలివిగా పుడుతుంది. అలాగే క్యారెట్ అండ్ దానిమ్మ జ్యూస్ తాగాలి.

గర్భిణీ మహిళల బొడ్డును మసాజ్ చేసుకోవాలి..

ప్రెగ్నెన్సీ స్త్రీలు తమ బొడ్డును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కడుపులోని బిడ్డ చురుగ్గా ఉంటుంది. శిశువు నాడీ వ్యవస్థను ఉత్తమంగా డెవలప్ చేయడానికి మేలు చేస్తుంది. వీలైతే బాదం ఆయిల్‌లో మసాజ్ చేసుకోవచ్చు. అలాగే గర్భావతి మహిళ పండ్లు, పువ్వుల స్మెల్ చూస్తే.. గర్భంలో ఉన్న బిడ్డ వాటి వాసనను గ్రహించగలదు. దీంతో వారి మెదడు అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది.

ఉదయాన్నే నార్మల్ వాకింగ్ చేయాలి..

శరీరానికి విటమిన్ డి కంటెంట్ అందాలంటే గర్భిణీ స్త్రీలు మార్నింగ్ పూట తప్పకుండా నడవాలి. ప్రతిరోజూ కనీసం 25 నిమిషాలు నడిస్తే పిల్లల బోన్స్ అండ్ శారీరక బలాన్ని పెంచుతుంది. అలాగే డైలీ మార్నింగ్ కోడిగుడ్డు, తినడం వల్ల కడుపులో ఉన్న బేబీ గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు తెలివిగలవారుగా జన్మిస్తారు.

పౌరాణిక కథలు చదవాలి..

బిడ్డ గర్భంలో పెరుగుతున్నప్పుడు గర్భిణీ ఉల్లాసమైన మ్యూజిక్ వింటే, బేబీకి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అలాగే పౌరాణిక కథలు చదవండి. ఇతరులతో మాట్లాడటం, నవ్వడం, సరదాగా కబుర్లు చెప్పడం లాంటివి ఏదైనా మంచి పనులు చేయండి. ఇవి పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. ఎందుకంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఇవన్నీ గమనిస్తుంది. కాబట్టి గర్భిణీలు ఇలా చేస్తే కడుపులో ఉన్న బిడ్డ తెలివిగా పుడుతుందని ప్రముఖ గైనకాలజిస్టులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed