Types Of Salt: ఉప్పులో ఐదు రకాలు.. ఆరోగ్యంపై ఏది ఎలా ప్రభావం చూపుతుందంటే..!

by Anjali |
Types Of Salt: ఉప్పులో ఐదు రకాలు..  ఆరోగ్యంపై ఏది ఎలా ప్రభావం చూపుతుందంటే..!
X

దిశ, ఫీచర్స్: ప్రతి భారతీయుల వంటకాల్లో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని రుచిగా మార్చడంతో సాల్ట్, ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడటంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని ఫిట్‌గా, హెల్తీగా ఉంచడానికి మన బాడికి సోడియం చాలా అవసరం. పలు ఆహారాలను స్టోర్ చేయడానికి కూడా ఉప్పును వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఉప్పు షడ్రుచులలో ఒకటి.కానీ ఉప్పును ఎప్పుడైనా సరే పరిమితిలో తీసుకోవాలి. లేకపోతే గుండెపోటు, స్ట్రోక్, కాల్షియం లోపం ఏర్పడుతుంది.

ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు

సాల్ట్ అధిక రక్తపోటును నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది.కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంతో, స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగించడం లాంటి ఎన్నో లాభాలున్నాయి. అయితే ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయో ఏ వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందా..

* సముద్రపు ఉప్పు..

సముద్రపు ఉప్పు లేదా సీసాల్ట్‌ను సముద్రంలోని వాటర్ నుంచి తయారు చేస్తారు. ఈ ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రాతి ఉప్పు కంటే ధర ఎక్కువగా ఉంటుంది. ఈ సాల్ట్ అధిక రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. మంచి రుచిని అందిస్తుంది.

* బ్లాక్ ఉప్పు..

బ్లాక్ ఉప్పును ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. దీన్ని మీ ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలను, అసిడిటీ, బ్లోటింగ్ సమస్యలను బ్లాక్ సాల్ట్ నయం చేస్తుంది. అసిడిటీ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తులేవరైనా ఈ నల్లుప్పును మజ్జిగలో మిక్స్ చేసి తాగినట్లలైతే వెంటనే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతారు.

* రాళ్లుప్పు..

రాళ్లు ఉప్పులో జింక్, కాల్షియం, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లైతే.. మిగతా ఉప్పు రకాల కంటే రాళ్లుప్పు ఉత్తమమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీన్ని ఫాస్టింగ్ సమయంలో కూడా ఉపయోగిస్తారు. తెలుపు, నల్లుప్పు కంటే 84 రెట్లు మంచిది. ఈ సాల్ట్ గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్దకాన్ని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.

* హిమాలయన్ పింక్ సాల్ట్..

పింక్ కలర్‌లో ఉండే హిమాలయన్ పింక్ సాల్ట్ ఇటీవల కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఉప్పు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో ఎంతో మేలు చేస్తుంది. జీర్ణశనిక్తి మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. బాడీలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటును నివారించడంలో మేలు చేస్తుంది.

* అయోడిన్ ఉప్పు..

అయోడిన్ ఉప్పు కూడా శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉప్పులో అయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథికి చాలా ప్రయోజనం చేకూరిస్తుంది. ఈ సాల్ట్‌ను ఎక్కువగా భారతీయ మహిళలు వంటకాల్లో ఉపయోగిస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఏ రకమైన ఉప్పునైనా పరిమితిలో తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story