పాదాలు.. పరిణామక్రమం.. అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు

by Javid Pasha |
పాదాలు.. పరిణామక్రమం.. అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
X

దిశ, ఫీచర్స్ : మనం ఏ పనిచేయాలన్నా శరీరంలో అన్ని భాగాలతోపాటు పాదాలు చాలా ముఖ్యం. చాలామంది నడవడానికి, నిలబడటానికే కదా అనుకుంటారు కానీ, పాదాల గురించి మనకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఒక రోజులో ప్రతి వ్యక్తి సగటున 8 వేల నుంచి 10 వేల అడుగులు నడుస్తారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మానవ శరీరంలోని మొత్తం ఎముకలలో పావువంతు పాదాలలోనే ఉంటాయి. ఒక పాదంలో దాదాపు 26 ఎముకలు ఉంటాయి. అయితే ఇది చేతిలో కంటే తక్కువ. కాగా మనం పుట్టినప్పుడు పాదాలలోని ఎముకలు ఎక్కువగా మృదులాస్థి కలిగి ఉంటాయి. 21 ఏండ్ల వయస్సు తర్వాతే ఎముకలు పూర్తిగా గట్టిపడతాయి.

రాతి పనిముట్లతో బూబ్లు

ప్రస్తుతం మనం బూట్లు, చెప్పులు వాడుతుంటాం. అయితే 40 వేల సంవత్సరాల కిందట కూడా పాదాల రక్షణకోసం ఏదో రూపంలో బూట్లను వాడే ప్రయత్నం జరిగిందని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. నియాండర్తల్స్ , ప్రారంభ మానవుల పాదాల ఎముకలను నిపుణులు విశ్లేషించగా అవి మందమైన, బలమైన కాలి వేళ్లను కలిగి ఉన్నాయి. చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల ఇలా ఏర్పడి ఉండవచ్చని చెప్తారు. అప్పట్లో రాతి పనిముట్లను బూట్ల ఉత్పత్తికి ఉపయోగించారట.

బొటనవేలు పరిణామం

ఇక పాదాలలోని బొటనవేలు పురాతన మానవ పూర్వీకులు చెట్లు ఎక్కడానికి, మనుషులను, వస్తువులను పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో పరిణామం చెందింది. పాదాల గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వెచ్చని, చెమటతో కూడిన పాదాలు బ్యాక్టీరియాకు నివాసంగా మారుతాయి. ఈ బ్యాక్టీరియా డెడ్ స్కిన్ సెల్స్‌ను తింటుందట. అలాగే పాదాల వాసనలను విడుదల చేసే వాయువులు, ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. యూకేలోని కాలేజ్ ఆఫ్ పొడియాట్రీ 2014 నాటి స్టడీ ప్రకారం.. పాదాల పరిణామ క్రమం మారుతూ వచ్చింది. 1970 నుంచి 2014 వరకు పరిశీలిస్తే సగటు పాదం రెండు పరిమాణాలు పెరిగింది. ప్రజలు హైట్, వెయిట్ పెరిగినప్పుడు కూడా పాదాలు పెరుగుతాయట. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.

Advertisement

Next Story