Failure Thoughts.. జీవితంలో వైఫల్యానికి దారితీస్తున్న కామన్ హాబిట్స్.. అధిగమించేదెలా?

by Javid Pasha |   ( Updated:2024-06-19 13:13:51.0  )
Failure Thoughts.. జీవితంలో వైఫల్యానికి దారితీస్తున్న కామన్ హాబిట్స్.. అధిగమించేదెలా?
X

దిశ,ఫీచర్స్ : మనం ఒక లక్ష్యం చేరుకోవడానికైనా, జీవితంలో అనుకున్నది సాధించడానికైనా అన్నింటికంటే ముందుగా మానసిక సంసిద్ధత చాలా ముఖ్యం. ఎందుకంటే మైండ్ అనేది అనుభవాలను రూపొందించడంలో, ప్రాసెస్ చేయడంలో పవర్‌ఫుల్ టూల్‌గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైతే మనం సాధించాల్సిన అంశాలపై మనసు కేంద్రీకరించలేకపోతామో.. అప్పటి నుంచి మనకు తెలియకుండానే పర్సనల్ గ్రోత్ ఆగిపోతుంది. ప్రధానంగా మనం జీవితంలో వెనుక బడటానికి, ప్రతి విషయంలో వైఫల్యం చెందడానికి ప్రధానంగా ఐదు అలవాట్లు కారణం అవుతున్నాయి. వాటిని గుర్తించి అధిగమిస్తే సక్సెస్ సాధించడం ఈజీ అవుతుంది. అవేమిటి? ఎలా అధిగమించాలో చూద్దాం.

నెగెటివ్ సెల్ఫ్ టాక్

చాలామంది తమ జీవితంలో విఫలం కావడానికి వారిలో ఉండే ప్రధానమైన బలహీనత నెగెటివ్ సెల్ఫ్ టాక్. అంటే వ్యక్తులు తమ గురించి తామే స్వీయ ప్రతికూలకు గురిచేసుకుంటారు. నిజానికి ఇది సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ డిప్రెషన్‌తో నిండిన ఇంటర్నల్ డైలాగ్‌లతో కూడిన ఒక సాధారణ అలవాటుగా మారుతుంది. ఇది మన అంతర్గత సమస్యలను, లోపాలను మరింత పెంచుతుంది. తమకు తాము బలహీనులుగా భావించేలా, ఇతరుల్లో చులకన అయ్యేలా చేస్తుంది. ప్రతికూల స్వీయ మానసిక ధోరణి అనేది కాలక్రమేణా ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. లక్ష్యాలను, ఆకాంక్షలను కొనసాగించడం కష్టతరం చేస్తుంది.

సెల్ఫ్ నెగటివ్ టాక్‌ను ఎదుర్కోవడానికి మనకు సెల్ఫ్ అవేర్‌నెస్‌ ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం మీ ఆలోచనలపై శ్రద్ధ వహించండి. నెగెటివ్ సెల్ఫ్ టాక్‌లో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించండి. ఒక విషయం గురించి మీరు ప్రతికూలంగా ఆలోచించే ముందు ఇది నిజంగా అవసరమా? లేదా అహేతుక విశ్వాసాల ఆధారంగా ఉందా? మీకు మీరే ప్రశ్నించుకోండి. అప్పుడు మీ మనసులోని ప్రతికూల చర్చను సానుకూల దృక్పథంతో పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. అవసరం అయితే మీరు సాధించిన సక్సెస్ గురించి, సంతోషకరమైన విషయాల గురించి ఆలోచించండి. ఇతరులతో చెప్పండి. మీపట్ల మీరు దయ, కరుణ, జాలి వంటి భావాలతో మసలు కోండి.

పర్‌ఫెక్షనిజం ఎల్లప్పుడూ కరెక్ట్ కాదు!

కొందరు ప్రతిదీ పరిపూర్ణంగా చేయాలనే అతి ఆలోచనలతో సతమతం కావడంవల్ల చివరికి ఏదీ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. పర్‌ఫెక్షనిజం తరచుగా పాజిటివ్ లక్షణంగా చెప్తుంటారు కానీ నిజానికి ఇది తప్పు. పర్‌ ఫెక్షనిజంపై ఎక్కువగా ఆధారపడటం, ఎక్కువగా ఆలోచించడం వంటివి వైఫల్యానికి దారితీయవచ్చు. అయితే ఆరోగ్యకరమైన కృషి, అన్ హె‌ల్తీ పర్ ఫెక్షనిజం మధ్య ఇక్కడ వ్యత్యాసం ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి. పరిపూర్ణవాదులు చాలా వరకు వాస్తవ విరుద్ధమైన ప్రమాణాలను ఏర్పర్చుకుంటూ ఉంటారు. దీనివల్ల వైఫల్యం చెందుతూ, అసమర్థ భావాలతో పోరాడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పరిపూర్ణత ఆలోచనలు స్వీయ విధ్వంసానికి దారితీస్తాయి.

అందుకే పర్ ఫెక్షనిజాన్ని పారదోలే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు దీనిని అధిగమించడానికి, రియలిస్టిక్ గోల్స్‌ను చేరుకోవడానికి, వాస్తవిక లక్ష్యాలను, అంచనాలను సెట్ చేయడం చాలా ముఖ్యం. తప్పులు, పొరపాట్లు జీవితంలో సహజం అని గుర్తించి, మరోసారి అలా జరగకుండా వాటిని మీ అభివృద్ధికి అవకాశాలుగా మల్చుకోండి. పరిపూర్ణతకంటే పురోగతిపై ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత మీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే రోజు తప్పక వస్తుంది.

ఇతరులతో పోలిక వద్దు

నేటి సోషల్ మీడియా ఆధారిత ప్రపచంలో ఇతరులతో మనల్ని మనం నిరంతరం పోల్చుకోవడం కామన్ అయిపోయింది. కానీ ఇది మనల్ని బలహీనతకు గురిచేసే అవకాశాలు కూడా ఎక్కువే. ఎందుకంటే మనం తరచుగా ఇతరుల జీవితాలకు సంబంధించి క్యూరేటెడ్ హైలైట్ రీల్స్ చూస్తుంటాం. ఇతరులు మనకంటే సంతోషంగా, సక్సెస్ ఫుల్‌గా, సంతృప్తిగా ఉన్నారని నమ్ముతుంటాం. ఈ అలవాటు మనలో అసమర్థతకు, స్వీయ సందేహాలకు ఆజ్యం పోస్తుంది. మన విలువలను, విజయాలను మనమే ప్రశ్నించేలా చేస్తుంది. కాబట్టి మీరు లైఫ్‌లో వెనుకబడకుండా ఉండాలంటే ఇతరులతో ఏ విషయంలోనూ పోల్చుకోకండి. పోలిక భావాల నుంచి బయటపడటానికి కృతజ్ఞత, స్వీయ ప్రశంసలను ప్రాక్టీస్ చేయండి. మీ బలాలు, విజయాలు, యునిక్ క్వాలిటీస్‌ని క్రమం తప్పకుండా గుర్తించండి. ఇతరులతో పోల్చుకోవడంకంటే మీ పర్సనల్ గ్రోత్ అండ్ ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టండి. మీరు ఆన్‌లైన్‌లో చూసేవన్నీ నిజ జీవితానికి వర్తించవని గుర్తుంచుకుంటే చాలు.

గతం గురించి ఆలోచనలు వద్దు

చాలామంది తాము ఎదుర్కొన్న గత చేదు అనుభవాలను, సంఘటనలను తల్చుకొని బాధపడుతుంటారు. దీనివల్ల వర్తమానంలో సంతోషాన్ని కోల్పోతారు. నిజానికి ఈ రూమినేషన్ మీ మైండ్‌లో పదే పదే రీ ప్లే చేయడంతో నిరాశ చెందుతుంటారు. ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా మీ ఆలోచలను, భావోద్వేగాలను ప్రతికూల చక్రంలో ఉంచుతుంది. కాబట్టి భవిష్యత్తుపై దృష్టి పెట్టలేకపోతారు. ఇలాంటి గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. స్వీయ కరుణతో, దయంతో ఉండండి. ప్రతి ఒక్కరూ తప్పులు లేదా పొరపాట్లు చేస్తారని గుర్తుంచుకోండి. ఈ విధమైన అవగాహనతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే చాలు. మీరు సక్సెస్ సాధించినట్లే. ఈ రూమినేషన్ నుంచి బయటపడటం గనుక మీకు కష్టం అనిపిస్తే థెరపిస్టులను లేదా కౌన్సెలర్ల హెల్ప్ తీసుకోండి.

వైఫల్యం చెందుతామన్న భయం

పని ప్రారంభించకముందే వైఫల్యం చెందుతామన్న భయం కొందరిని వెంటాడుతుంది. నిజానికి ఇది ఒక పవర్ ఫుల్ మానసిక అవరోధం లాంటిదని నిపుణులు చెప్తున్నారు. ఇది చాలా మంది వ్యక్తులు తమ కలలను సాకారం చేసుకోవడానికి అడ్డుపడుతుంది. సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. తరచుగా స్వీయ పరిమితి నమ్మకాలు, మన సామర్థ్యాలపై మనకు విశ్వాసం లేకపోవడంవల్ల ఈ భయం ఏర్పడుతుంది. ఇది అనేక అవకాశాలను దూరం చేస్తుంది. ఎప్పుడైతే మనం వైఫల్యం చెందుతామనే ముందస్తు భయాన్ని వదిలేస్తామో అప్పుడు తప్పక విజయం సాధిస్తాం.

అయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్‌ను అధిగమించడం ప్రాక్టీస్ చేయాలి. మీ స్వీయ అభివృద్ధికి అనుగుణంగా అవకాశాలను మల్చుకునేలా వైఫల్యాన్ని రీ ఫ్రేమ్ చేయడం ప్రారంభించండి. చిన్న విజయాలను, పురోగతిని మీ వ్యూహాలను మళ్లీ అంచనా వేయడానికి, మెరుగు పర్చుకోవడానికి ఉపయోగించుకోండి. మీ లక్ష్యాలను కొనసాగించడానికి, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహించే వారితో అవసరమైతే చర్చిచండి.

Advertisement

Next Story