పాస్‌వర్డ్స్‌ హ్యాకింగ్‌పై పది లక్షల యూజర్లకు ఫేస్‌బుక్ హెచ్చరిక

by Hamsa |   ( Updated:2022-10-08 16:41:42.0  )
పాస్‌వర్డ్స్‌ హ్యాకింగ్‌పై పది లక్షల యూజర్లకు ఫేస్‌బుక్ హెచ్చరిక
X

దిశ, ఫీచర్స్ : Apple Inc., Alphabet Inc. సాఫ్ట్‌వేర్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేయబడిన యాప్స్‌తో సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా ఆయా యూజర్ల అకౌంట్ డీటెయిల్స్ ప్రమాదంలో పడి ఉండవచ్చని మెటా ప్లాట్‌ఫామ్ కంపెనీ తెలిపింది. సుమారు 1 మిలియన్ ఫేస్‌బుక్ వినియోగదారులకు ఈ విషయం తెలియజేస్తామని పేర్కొంది. లాగిన్ సమాచారాన్ని దొంగిలించడానికి ఇంటర్నెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్న 400కు పైగా హానికరమైన ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్‌ను ఈ ఏడాది గుర్తించినట్లుగా కంపెనీ శుక్రవారం ప్రకటించింది. సదరు యాప్స్ తొలగింపును సులభతరం చేయడానికి సంబంధిత సమస్య గురించి యాపిల్, గూగుల్ రెండింటికీ తెలియజేసినట్లు మెటా వెల్లడించింది.

ఈ తరహా యాప్స్.. ఫొటో ఎడిటర్స్, మొబైల్ గేమ్స్ లేదా హెల్త్ ట్రాకర్స్‌గా మారువేషంలో పనిచేశాయని ఫేస్‌బుక్ తెలిపింది. సమస్యాత్మకమైన 400 యాప్స్‌లో 45 యాప్స్ తమ యాప్‌ స్టోర్‌లో ఉన్నాయని, వాటిని తొలగించినట్లు యాపిల్ పేర్కొనగా.. సందేహాస్పదమైన అన్ని హానికరమైన యాప్స్‌ను గూగుల్ తొలగించిందని ప్రతినిధి తెలిపారు.

'ఈ యాప్స్ ఎంత జనాదరణ పొందాయో సైబర్ నేరస్థులకు తెలుసు. యూజర్లను మోసగించి వారి ఖాతాల సమాచారాన్ని దొంగిలించేందుకు వారు ఇలాంటి థీమ్స్‌నే ఉపయోగిస్తారు' అని మెటా గ్లోబల్ థ్రెట్ డిస్ట్రప్షన్ డైరెక్టర్ డేవిడ్ అగ్రనోవిచ్ అన్నారు. ఒక యూజర్ హానికరమైన యాప్స్‌లో ఒకదాన్ని డౌన్‌లోడ్ చేసిన తర్వాతే సాధారణ స్కామ్ బయటపడుతుంది. యాప్‌కు ప్రాథమిక కార్యాచరణకు మించి పనిచేయడానికి ఫేస్‌బుక్ లాగిన్ అవసరం. తద్వారా యూజర్‌ తన పేరు, పాస్‌వర్డ్‌ను అందించేలా మోసం చేస్తుంది. ఉదాహరణకు.. వినియోగదారులు వారి ఫేస్‌బుక్ ఖాతాకు ఎడిటెడ్ ఫొటోను అప్‌లోడ్ చేయవచ్చు. కానీ ఈ ప్రక్రియలో వారు తమకు తెలియకుండానే యాప్ రచయితకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా వారి ఖాతాను ప్రమాదంలో పడేసుకుంటున్నారని వివరించారు.

ఫేస్‌బుక్ లేదా ఇతర ఖాతాల కోసం ఆధారాలను దొంగిలించే సమస్యాత్మక యాప్స్‌ను మెరుగ్గా ఎలా గుర్తించాలో నేర్చుకోవడం ద్వారా వారు 'రీ కాంప్రమైజ్' కాకుండా ఎలా నివారించవచ్చనే దానిపై సంభావ్య బాధితులతో చిట్కాలను పంచుకుంటామని మెటా తెలిపింది.

అదిరిపోయే ఆలోచనలు స్నానం చేస్తున్నప్పుడే ఎందుకొస్తాయ్?

Advertisement

Next Story

Most Viewed