మీ టూత్ బ్రష్ బాత్రూమ్‌లో పెడుతున్నారా? భారీ ముప్పు తప్పదుంటున్న నిపుణులు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-12 07:48:31.0  )
మీ టూత్ బ్రష్ బాత్రూమ్‌లో పెడుతున్నారా? భారీ ముప్పు తప్పదుంటున్న నిపుణులు..
X

దిశ, ఫీచర్స్: మీ టూత్ బ్రష్ బాత్రూమ్ లో పెడుతున్నారా? ఇప్పుడే దాన్ని బయటపడేయమని సూచిస్తున్నారు నిపుణులు. వాష్ రూమ్ లో ఉండే వాతావరణం చల్లగా, తేమగా ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియా, పాతోజెన్స్ పెరుగుతాయని.. అవి కాస్త బ్రష్ పైకి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవి నోటి ఆరోగ్యంపై దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తాయని చెప్తున్నారు. చిగురువాపు, పీరియాంటైటిస్, దంత క్షయానికి దారితీస్తాయని.. కాలక్రమేణా నోటి ఇన్‌ఫెక్షన్‌, శ్వాసకోశ సంబంధింత వ్యాధులకు కారణమవుతాయని వివరిస్తున్నారు. ఈ సమస్య చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ పూర్తి ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతుందంటున్న నిపుణులు.. కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు.

జాగ్రత్తలు :

* ప్రతి 3-4 నెలలకోసారి టూత్ బ్రష్‌లను మార్చండి.

*ఉపయోగించిన తర్వాత శుభ్రంగా కడిగి పొడి వాతావరణంలో నిల్వ చేయండి.

* టూత్ బ్రష్‌లను పంచుకోవడం లేదా బాత్రూమ్ దగ్గర్లో నిల్వ చేయడం మానుకోండి.

*యాంటీమైక్రోబయల్ టూత్ బ్రష్ శానిటైజర్‌ లేదా క్లోరెక్సిడైన్/ఎసెన్షియల్ ఆయిల్ మౌత్ వాష్‌లలో నానబెట్టడం మంచిది.

* టూత్ బ్రష్‌లపై ఉండే సూక్ష్మజీవుల నుంచి రక్షించుకోవడానికి నోటి పరిశుభ్రత విధానాలను పాటించండి.

*మార్కెట్‌లో అతినీలలోహిత కాంతి కంటైనర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Next Story