కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఇదే.. ఏం చేయాలంటే..

by Javid Pasha |
కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఇదే.. ఏం చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో చాలామంది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. అందుకు రకరకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కొందరు తమకు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తాయి కానీ తగ్గడం లేదని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే తగ్గకపోవడానికి ప్రత్యేక కారణం ఉండవచ్చు. సదరు వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం లేదా డయాబెటిస్ పేషెంట్ అయి ఉండటంవల్ల అలా జరుగుతుందని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. డయాబెటిస్ కేవలం కిడ్నీలు, లివర్, కళ్లు, గుండె సంబంధిత అంశాలనే కాదు, చర్మ సంబంధింత విషయాల్లోనూ సమస్యలకు కారణం అవుతుంది. కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ప్రధానంగా మధుమేహం బాధితులను వేధిస్తుంటాయి. అవేంటో చూద్దాం.

సోరియాసిస్

ఈ రకమైన చర్మ సమస్య ప్రధానంగా టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో పెరిగే అవకాశం ఎక్కువ. ఫలితంగా స్కిన్‌పై తెల్లటి పొలుసులు ఏర్పడతాయి. దురద కారణంగా చర్మం ఎరుపుగా మారుతుంది. అంతేకాకుండా పొడిబారుతుంది. ఎలివేటెడ్ రక్తంలో షుగర్ లెవల్స్ యూరిన్‌ను క్రియేట్ చేయడానికి స్కిన్ సెల్స్ నుంచి లిక్విడ్‌ను తీసే ప్రక్రియలో శరీరానికి సహకరిస్తాయి. స్కిన్ పొడిబారడం లేదా పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. ఇక డయాబెటిక్ న్యూరోపతి, నరాల బలహీనత వంటివి కూడా చర్మంపై పగుళ్లకు కారణం అవుతాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్స్

ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మధుమేహం ఉన్నవారికి త్వరగా సోకే చాన్స్ ఉంటుంది. కాలి వ్రేళ్ల మధ్య, మోచేయి మడతల భాగంలో, చంకల్లో, గొంత కింద, నోటి దగ్గరగా దద్దుర్లు , పొలుసులుగా కనిపిస్తే తప్పక ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని అనుమానించవచ్చు. కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్లలో కాండిడా అల్బికాన్స్, రింగ్‌వార్మ్‌లు, అథ్లెట్స్ ఫుట్, రిపీటెడ్‌గా వచ్చే యోని ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు వంటివి ఉన్నాయి. వీటితోపాటు బాక్టీరియల్ ఇన్పెక్షన్ల రిస్క్ కూడా పొంచి ఉంటుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు దురద, చర్మంపై దద్దుర్లు, రంగు మారడం వంటివి గమనిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story