- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Looking beautiful : ఆందోళన వద్దు.. వయసును తగ్గించుకోండిలా..

దిశ, ఫీచర్స్ : మారుతున్న ఆహారపు అలవాట్లు.. క్షణం తీరికలేని జీవనశైలి.. మానసిక ఒత్తిడి.. ఇలా కారణాలేవైనా ప్రస్తుతం 30 ఏండ్లు కూడా దాటకముందే ముఖంపై వృద్ధాప్యఛాయలతో ఇబ్బంది పడుతున్నారు పలువురు. ఒకప్పుడైతే వైట్ హెయిర్ ఏజ్ బార్ అయిన వారిలోనే కనిపించేవి. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ కనిపిస్తున్నాయి. పాతికేళ్ల వయసులోనే 60 ఏళ్ల వయసుతో సమానమైన లక్షణాలతో యువతరం ఇబ్బంది పడుతోంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే.. 50 ఏండ్లు దాటినా ఇంకా నలభై వంటి శరీర ఛాయలను సొంతం చేసుకోవాలంటే.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
మెదడుకు పోషణ
మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఇది హెల్తీగా ఉన్నప్పుడే మనం చురుగ్గా ఉండగలం. ముఖ్యంగా వయసు మీద పడుతున్న కొద్దీ డెమెన్షియా లేదా అల్జీమర్స్ వంటివి దాడిచేస్తుంటాయి. శారీరక మార్పులు, హార్మోన్లు, పోషకాల లోపాలు వృద్ధాప్య ఛాయలను మరింత పెంచుతాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే బెర్రీలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ప్రతీ వారం కనీసం రెండు బెర్రీలను తీసుకోవడంవల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అట్లనే జ్ఞాపక శక్తి క్షీణించకుండా ఉండటంలోనూ ఇవి కీ రోల్ పోషిస్తాయని హార్వర్డ్ బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ రీసెర్చర్స్ పరిశోధనలో వెల్లడైంది.
కాలేయానికి రక్షణ
మనిషి ఆరోగ్యాన్ని, ఏజ్ రిలేటెడ్ పరిణామాలను కాలేయం కూడా ప్రభావితం చేస్తుంది. అంటే లివర్ హెల్తీగా ఉంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. ఎందుకంటే ఇది రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌ల విడుదల వరకు కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగానే ఏజ్ పెరిగే కొద్దీ కాలేయం పనితీరులో మార్పులు వస్తుంటాయి. సరైన పోషణ లభిస్తే కాలేయం చాలా కాలం పాటు హెల్తీగా ఉంటుంది. అందుకే కాలేయాన్ని పాడు చేసే ఆల్కహాల్, ఇతర పదార్థాలు, పానీయాలు వంటివి అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. జీవనశైలిలో మార్పులతోపాటు రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవాలి. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. కాలేయం హెల్తీగా ఉంటే సాధారణ వయసుకంటే తక్కువ వయసు కలిగిన వారిలా యాక్టివ్‌గా ఉంటారు.
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించే మరో భాగం కళ్లు. కళ్లకింద చర్మం ముడతలు పడటం, కంటి చూపు మందగించడం వంటివి వయసు మీదపడిన వారిలో అధికంగా కనిపించే లక్షణాలు. చిన్న వయసులో కాటరాక్ట్, మాలిక్యులర్ డీజనరేషన్, గ్లకోమా వంటి ప్రాబ్లమ్స్ చుట్టుముడట్టడం కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరంలో వృద్ధాప్య ఛాయలను ప్రేరేపిస్తాయి. సో.. అందుకే కళ్లను కాపాడుకునే ఆహారంపై శ్రద్ధ పెడితే.. మీ యవ్వనాన్ని కూడా కాపాడుకున్నవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు. అందుకోసం విటమిన్ ఎ ఎక్కువగా లభించే క్యారెట్, పాలకూర, తోటకూర వంటి ఆకు కూరలు, పాలు, గుడ్లు, చేపలు, చిలగడ దుంప, నారింజ పండు వంటివి రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
మెటబాలిక్ సిస్టమ్
పేగులు సక్రమంగా పనిచేయకపోయినా వృద్ధాప్యం త్వరగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావడంలో, శరీరానికి పోషకాలు లభించడంలో పేగులు కీలక పాత్ర పోషిస్తాయి. అప్పుడే తగిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా పేగుల్లో ఉండే గట్ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అది లేకపోతే వృద్ధాప్యం త్వరగా సంభవిస్తుంది. అందుకే ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కూరగాయలు, చేపలు, మాసం, పెరుగు వంటివి పేగు ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ముఖంపై యవ్వన ఛాయను పెంపొందించడంలో సహాయపడతాయి. అట్లనే పాలు, పాల ఉత్పత్తులు ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. దీంతోపాటు రెగ్యులర్ వ్యాయామాలు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ వంటివి మీ వయసును తగ్గించడంలో సహాయపడతాయి.